బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ సీజన్ 4' ప్రేక్షకుల ఆదరణను పొందుతూ ముందుకు సాగుతోంది. ఆహాలో ప్రసారమవుతున్న ఈ షోలో రామ్ చరణ్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో చరణ్‌తో పాటు శర్వానంద్, దిల్ రాజు, నిర్మాత విక్రమ్ సందడి చేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ప్రోమో ట్రెండింగ్‌లో ఉంది. ప్రోమోలో బాలయ్య.. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఒక ఫోటోను చూపించి, "ఈ ముగ్గురిలో ఎవరితో పార్టీకి వెళ్తావు?" అని చరణ్‌ను ప్రశ్నించారు. దీనికి చరణ్ నవ్వుతూ..' ముగ్గురితో కాదు, మా మామతో వెళ్తాను. మా మామ (అరవింద్ గారు) పార్టీలకు బెస్ట్' అని చెప్పాడు. Also Read : కింగ్ ఆఫ్ జంగిల్.. 'డాకు మహారాజ్' ట్రైలర్ వచ్చేసింది ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ ఎలాగో పార్టీలకు దూరంగా ఉంటారు. నాగబాబు, చిరంజీవి కూడా అంత పార్టీ మూడ్ పర్సన్స్ కాదని చరణ్ ఇన్ డైరెక్ట్ గా చెప్పేసాడు. ఇక ఇదే ప్రోమోలో చరణ్ తన కూతురు క్లింకార గురించి మాట్లాడుతూ..' ఆమె చాలా బక్కగా ఉంటుంది, రోజూ రెండు గంటలు తనతో ఆడుకుంటాను' అంటూ చెప్పాడు. క్రమంలోనే బాలకృష్ణ "నీ కూతుర్ని ఎప్పుడూ చూపిస్తావు?" అని ప్రశ్నించగా, "ఆమె నన్ను నాన్న అని పిలిచే రోజు అందరికీ రివీల్ చేస్తాను" అన్నారు. అంతేకాకుండా శర్వానంద్ తన చరణ్‌తో ఉన్న స్నేహాన్ని, ఉపాసనతో ఉన్న అనుబంధాన్ని కూడా పంచుకున్నారు. ప్రోమో చివర్లో బాలయ్య, చరణ్.. ప్రభాస్‌తో ఫోన్ కాల్‌లో మాట్లాడటం కూడా చూపించారు. Also Read : టికెట్ రేట్లు పెంచుతుంది అందుకే.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్