నందమూరి బాలకృష్ణ నటించిన "డాకు మహారాజ్" సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే విడుదలైన టీజర్, మూడు పాటలు మంచి స్పందన పొందాయి. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ట్రైలర్‌ని చూస్తే, బాలయ్య ఈ చిత్రంలో డబుల్ రోల్ పోషించారని, ఒకటి ప్రస్తుత కథలోని పాత్ర కాగా, మరోటి పీరియాడిక్ యాక్షన్ నేపథ్యంతో ఉన్న పాత్ర అని తెలుస్తోంది. చిన్న పాపతో సాగే ఎమోషన్ తో పాటు ప్రజలను రక్షించే హీరో కథగా సినిమా ఉండబోతుందని ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పేశారు. Also Read : టికెట్ రేట్లు పెంచుతుంది అందుకే.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ The HUNT begins... and it"s going to be WILD! 🪓🔥#DaakuMaharaajTrailer OUT NOW! 💥- https://t.co/ay1ieVlqAaGet ready for the SANKRANTHI MASSACRE on JAN 12, 2025! ❤️🔥#DaakuMaharaaj 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol @dirbobby @MusicThaman @Vamsi84… pic.twitter.com/bVdZKtA8vR — Sithara Entertainments (@SitharaEnts) January 5, 2025 "అడవిలో ఎన్ని క్రూర మృగాలు ఉన్నా, ఇక్కడ కింగ్ ఆఫ్ ది జంగిల్ ఉన్నాడు" అంటూ బాలయ్య గురించి చెప్పిన డైలాగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ తరహా డైలాగ్‌లు సినిమాలో చాలా ఉంటాయని స్పష్టమవుతోంది. దర్శకుడు బాబీ టేకింగ్ ఓ రేంజ్ లో ఉందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇది కూడా చదవండి: Pawan; సినిమా ఇండస్ట్రీకి పవన్ కీలక సూచన.. సంచలన లేఖ విడుదల! మేకర్స్ ట్రైలర్‌ను పూర్తిగా యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా కట్ చేశారు. తమన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ట్రైలర్ చివర్లో విలన్ అడిగిన 'ఎవడ్రా నువ్వు?' అన్న ప్రశ్నకు బాలయ్య 'మైఖేల్ జాక్సన్' అని చెప్పిన డైలాగ్ మాత్రం ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది.