RC 16 Leakes: బ్యాట్ పట్టిన రామ్ చరణ్.. ‘RC16’ నుంచి వీడియో లీక్!

రామ్ చరణ్ ‘RC16’ మూవీ నుంచి ఓ వీడియో లీక్ అయింది. అందులో రామ్ చరణ్ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతుండటం చూడవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది.

New Update
Ram Charan playing cricket video leake from RC 16 movie shooting

Ram Charan playing cricket video leake from RC 16 movie shooting

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లో 16 చిత్రం చేస్తున్నాడు. ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో రామ్ చరణ్ గ్లోబల్ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 

ఇది కూడా చూడండి: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

వీడియో లీక్

స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించాడు. కానీ అనుకున్నంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో ఇప్పుడు బుచ్చిబాబు సినిమాతో మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో రామ్ చరణ్‌ సరసన అతిలోక సుందరి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. 

అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సైతం కీలక పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ ఒక క్రీడాకారుడి పాత్రలో కనిపించనున్నాడు. అతడు ఒక క్రికెట్ ప్లేయర్‌గా, కుస్తీ ఆటగాడిగా ఇలా పలు ఆటలు ఆడే యువకుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: 40 ఏళ్ల తర్వాత కూడా యంగ్‌గా కనిపించాలంటే ఇలా చేయండి

ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించి ఓ వీడియో లీక్ అయి నెట్టింట వైరల్‌గా మారింది. షూటింగ్ సెట్‌లో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతున్న దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో రామ్ చరణ్.. గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది. అది చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు