Peddi Movie: రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న 'పెద్ది' రోజురోజుకు అంచనాలను మించిపోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. . ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న తాజా షెడ్యూల్‌లో, సినిమాకే హైలైట్‌గా నిలిచే ఒక అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Kuberaa Trailer: 'కుబేరా' ట్రైలర్ లో ఇదే హైలైట్.. ధనుష్- నాగ్ కాంబో అదిరింది!
భారీ ట్రైన్ సీక్వెన్స్
ఈ యాక్షన్ సన్నివేశం కోసం, చిత్ర బృందం ఏకంగా ఒక ప్రత్యేక రైలు సెట్‌ను రూపొందించారట! సాధారణంగా ఇలాంటి సీక్వెన్స్‌ల కోసం గ్రాఫిక్స్ లేదా చిన్న సెట్‌లను ఉపయోగిస్తారు. కానీ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఎంతో శ్రద్ధగా, రియాలిటీకి దగ్గరగా చూపించడానికి భారీ రైలు సెట్‌ను నిర్మించారని సమాచారం. ఈ సెట్ లో రామ్ చరణ్‌తో పాటు ఇతర నటీనటులపై ఈ ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాన్ని తీస్తున్నారు.
#PEDDI - A craziest & One of the Best Train Fight Sequence Loading..🔥🔥
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) June 18, 2025
Global Star #RamCharan full efforts and display under the action choreography of #Nabakanth ( earlier worked for #Pushpa) pic.twitter.com/VOxgNKuS9C
ఈ భారీ సీక్వెన్స్ కు నబాకాంత్ మాస్టర్ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ యాక్షన్ స్టంట్స్, పోరాటాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని టాక్. అంతేకాదు ఈ ట్రైన్ సీక్వెన్స్ సినిమాలోని ప్రధాన హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని సమాచారం. దీనికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
'రంగస్థలం'లో తన అద్భుతమైన నటన, రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌తో ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్.. ఇప్పుడు 'పెద్ది'లో మరోసారి అదే తరహా పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన 'ఫస్ట్ షాట్ గ్లింప్స్' అంచనాలను పెంచేసింది.