గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' మూవీ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి..
'గేమ్ ఛేంజర్' తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.127 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. నైజాంలోనే రూ.44 కోట్ల బిజినెస్ జరగ్గా, ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యధికమని చెబుతున్నారు. ఇక్కడ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR రూ.70 కోట్ల బిజినెస్ చేయగా, రామ్ చరణ్-చిరంజీవి కలిసి నటించిన ఆచార్య ₹38.50 కోట్ల మేర బిజినెస్ చేసింది.
Also Read : ఆస్కార్ బరిలో అట్టర్ ప్లాప్ సినిమా.. నెట్టింట ట్రోల్స్
#GameChanger AP-TG Pre Release Business Details(Valued)
— Rebal Relangi (@RebalRelang) January 7, 2025
👉Nizam: 43.50Cr
👉Ceeded: 23Cr
👉UA: 14.20Cr
👉East: 10Cr
👉West: 8.10Cr
👉Guntur: 10.20Cr
👉Krishna: 8.50Cr
👉Nellore: 4.50Cr
AP-TG Total:- 122CR(Break Even- 124CR+).#GameChanager #RamCharan𓃵pic.twitter.com/JjHUly1150
అంతకుముందు వచ్చిన వినయ విధేయ రామ రూ.24 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించింది. అయితే 'గేమ్ ఛేంజర్' మాత్రం రూ.44 కోట్ల బిజినెస్ చేయడం విశేషం. ఆడియన్స్ లో సినిమాకి ఉన్న హైప్ ను బట్టి పాజిటివ్ టాక్ అందుకుంటే, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం.
మిగతా ఏరియాల్లో చూసుకుంటే..
సీడెడ్‌లో ఈ చిత్రం రూ.24 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.15 కోట్లు,
గుంటూరులో రూ.11 కోట్లు,
ఈస్ట్ గోదావరిలో రూ.10.5 కోట్లు,
వెస్ట్ గోదావరిలో రూ.9 కోట్లు,
కృష్ణా జిల్లాలో రూ.8.5 కోట్లు,
నెల్లూరులో రూ.5 కోట్లు
Also Read : ఆస్కార్ బరిలో అట్టర్ ప్లాప్ సినిమా.. నెట్టింట ట్రోల్స్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద రూ.127 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ తో బ్రేక్ ఈవెన్ సాధించడం అనేది పెద్ద కష్టమేమి కాదు. ఇది పాన్-ఇండియా మూవీ కాబట్టి ఇతర భాషల మార్కెట్లలో కూడా మంచి బిజినెస్ జరిగినట్లు సమాచారం. నార్త్ లో చరణ్ ఉన్న క్రేజ్ బట్టి పెద్ద అమౌంట్ లోనే బిజినెస్ జరిగినట్లు టాక్. మలయాళంలో అనుకున్నంత లేకపోయిన తమిళ, కన్నడ భాషల్లో మంచి బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇండియాతో పాటు ఓవర్సీస్ అంత కలుపుకుని బిజినెస్ రూ.200- రూ.230 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఓన్లీ ఇండియా వైడ్‌గా రూ.175-రూ.185 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తోంది.