Chikiri Chikiri: యూట్యూబ్‌లో మరో మైల్ స్టోన్ చేరుకున్న రామ్ చ‌ర‌ణ్ ‘చికిరి చికిరి’.. ఎన్ని వ్యూస్ అంటే..?

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘చికిరి చికిరి’ పాట భారీ హిట్ అయింది. ఏఆర్ రెహమాన్ సంగీతం, చరణ్ డాన్స్‌తో ఈ పాట 100 మిలియన్ వ్యూస్ దాటింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో సినిమా 2026 మార్చి 27న విడుదల కానుంది.

New Update
Chikiri Chikiri

Chikiri Chikiri

Chikiri Chikiri: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘పెద్ది (Peddi)’పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట ‘చికిరి చికిరి’ ఇప్పుడు మ్యూజిక్ చార్ట్‌లను షేక్ చేస్తోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ నుంచి వచ్చిన పాటల్లో ఇంత పెద్ద స్థాయిలో హిట్ అయిన పాట చాలా అరుదు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ పాటను ఎంతో మధురంగా కంపోజ్ చేయగా, హీరో హీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా సింపుల్‌గా చూపించారు. మోహిత్ చౌహాన్ ఈ పాటను పాడారు.

Also Read: సంజయ్ సాహు తిరిగొస్తున్నాడు. ‘జ‌ల్సా’ రీ-రిలీజ్‌.. ఎప్పుడంటే..?

పాటకు రామ్ చరణ్ చేసిన డాన్స్ మూవ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయన ఎనర్జీ, స్టెప్పులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. విడుదలైన కేవలం నెల రోజుల్లోనే ఈ పాట తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దాటడం విశేషం. ఇప్పటివరకు 11 లక్షలకుపైగా లైక్స్ రావడం చూస్తే పాటకున్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది. ఐదు భాషల్లో కలిపి ఈ పాట మొత్తం 150 మిలియన్ వ్యూస్ సాధించింది.

Also Read: యూట్యూబ్‌లో మరో మైల్ స్టోన్ చేరుకున్న రామ్ చ‌ర‌ణ్ ‘చికిరి చికిరి’.. ఎన్ని వ్యూస్ అంటే..?

‘పెద్ది’ సినిమా ఒక గ్రామీణ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి నటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ‘పెద్ది’పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. రామ్ చరణ్ కూడా ఈ సినిమా గురించి చాలా నమ్మకంగా ఉన్నారు. షూటింగ్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ప్లానింగ్‌తో జరుగుతోంది.

Also Read: 'అఖండ 2' మండే టెస్ట్ పాస్ అయ్యిందా..? కలెక్షన్స్ అంతంత మాత్రమేనా..?

మొదటగా ఈ సినిమాను 2026 మార్చి 27న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఇటీవల రిలీజ్ వాయిదా పడుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని సమాచారం. దర్శకుడు బుచ్చిబాబు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పనులు పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. కాబట్టి సినిమా వాయిదా పడే అవకాశం లేదని టాక్.

Also Read: "ఓజీ" డైరెక్టర్‌ సుజీత్‌కు పవన్ కాస్ట్లీ కార్ గిఫ్ట్ !! ధర ఎంతంటే?

ఇక ‘చికిరి చికిరి’ తర్వాత వచ్చే రెండో పాటపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పాట మించి హిట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి ‘పెద్ది’ సినిమాపై క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది.

Advertisment
తాజా కథనాలు