/rtv/media/media_files/2025/12/16/akhanda-2-collections-2025-12-16-17-56-55.jpg)
Akhanda 2 Collections
Akhanda 2 Collections: బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 ప్రారంభ మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ సాధించింది. అయితే, మంగళవారం బాక్సాఫీస్ వద్ద కొంచెం షాక్ తగిలింది. రిపోర్ట్ల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు సినిమా సుమారుగా ₹6 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది.
నిజాం, సీడెడ్ బెల్ట్ ప్రాంతాల్లో కొంతమేర స్థిరమైన కలెక్షన్స్ ఉన్నాయి. కానీ మొత్తం ట్రెండ్ చూస్తే, కోసం కొంచెం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో టిక్కెట్ ధరలు తగ్గించని కారణంగా, మిక్స్డ్ పబ్లిక్ రియాక్షన్ వల్ల ఫుట్‌ఫాల్స్ తగ్గాయని ఎగ్జిబిటర్స్ చెప్పుతున్నారు. వీక్డేస్‌లో ఖాళీ థియేటర్లు కనిపిస్తున్నాయి.
Also Read: "ఓజీ" డైరెక్టర్ సుజీత్‌కు పవన్ కాస్ట్లీ కార్ గిఫ్ట్ !! ధర ఎంతంటే?
ప్రస్తుతం మొత్తం కలెక్షన్ సుమారుగా ₹90 కోట్లుకి చేరినట్టు అంచనా. అంటే, సినిమాకు 50% మాత్రమే రికవరీ అయింది, బ్రేక్ ఈవెన్ ఇంకా దూరంలోనే ఉంది. మిక్స్డ్ టాక్ కొంత ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతీయ ప్రేక్షకుల నుండి కొంత నెగటివ్ రిపోర్ట్లు వచ్చాయి. బోయపాటి స్టైల్ ఎలివేషన్స్ హిందీ ప్రేక్షకులకు అంతగా పని చేయలేదని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొన్నారు. కొన్ని సీన్లు మాత్రమే వాళ్లకు వర్కౌట్ అయినట్టుగా తెలుస్తోంది. కానీ పబ్లిక్ నుండి స్ట్రాంగ్ యూననిమస్ టాక్ రాలేదు. ప్రోమోషన్స్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదని చెప్పుతున్నారు. అంతేకాక, ధురంధర్ సినిమాకు వచ్చిన మంచి టాక్ కూడా అఖండ 2 కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది.
Also Read: 'అఖండ 2' మండే టెస్ట్ పాస్ అయ్యిందా..? కలెక్షన్స్ అంతంత మాత్రమేనా..?
ఈ పరిస్థితిలో, తెలుగులో అఖండ 2 పూర్తిగా రికవరీ చేయడం కొంచెం కష్టం అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ శుక్రవారం అవతార్ 3 విడుదల కావడంతో, దాని పాజిటివ్ టాక్ కూడా అఖండ 2కి ప్రెషర్ పెడుతుంది. హైదరాబాద్లో సక్సెస్ మీట్ ఇప్పటికే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో మరో ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారా అని చూడాల్సి ఉంది.
మొత్తంగా, అఖండ 2 ప్రారంభ మూడు రోజుల రన్ తర్వాత వీక్డే కలెక్షన్స్ తగ్గడంతో, సినిమా రికవరీపై అనుమానం నెలకొంది. ఇతర భారీ రిలీజ్‌లు, మిక్స్డ్ టాక్ వల్ల సినిమా భవిష్యత్‌లో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Follow Us