Director Sujeeth: "ఓజీ" డైరెక్టర్‌ సుజీత్‌కు పవన్ కాస్ట్లీ కార్ గిఫ్ట్ !! ధర ఎంతంటే?

‘దే కాల్ హిమ్ OG’ భారీ విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్‌కు కోటి రూపాయిలు విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ బహుమతిగా ఇచ్చారు. పవన్ తో కలిసి సుజీత్‌ కొత్త కారుతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

New Update
Director Sujeeth

Director Sujeeth

Director Sujeeth: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానిగా మొదలైన ప్రయాణం.. ఇప్పుడు అదే హీరోతో సినిమా చేసి హిట్ కొట్టి, ఆయన చేతుల మీదుగా కోటి రూపాయిలు విలువైన బహుమతి అందుకోని దర్శకుడు సుజీత్‌ తన కలను నిజం చేసుకున్నాడు. 

ఇటీవల విడుదలైన యాక్షన్ గ్యాంగ్‌స్టర్ సినిమా ‘దే కాల్ హిమ్ OG’ (They Call Him OG) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్‌గా నటించడం మరో ప్రత్యేక ఆకర్షణ.

ఈ సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ తన దర్శకుడు సుజీత్‌కు అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన సుజీత్‌కు ఒక ఖరీదైన బ్లాక్ కలర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్(Land Rover Defender) కారును బహుమతిగా ఇచ్చారు.

సుజీత్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి కొత్త కారుతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో ఆయన ఎమోషనల్ గా స్పందిస్తూ, “ఇది నాకు జీవితంలో వచ్చిన బెస్ట్ గిఫ్ట్. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమాని. ఇప్పుడు ఆయనతో సినిమా చేసి, ఆయన నుంచి ఇలాంటి బహుమతి అందుకోవడం నిజంగా నమ్మలేని విషయం. ఆయన ప్రేమ, ప్రోత్సాహం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎప్పటికీ ఋణపడి ఉంటాను” అని రాశారు.

ఫోటోల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా కార్ డోర్ తెరిచిన దృశ్యాలు, సుజీత్ డ్రైవర్ సీట్‌లో కూర్చుని ఆనందంగా నవ్వుతున్న క్షణాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

‘దే కాల్ హిమ్ OG’ సినిమా పవన్ కళ్యాణ్‌కు రెండు సంవత్సరాల విరామం తర్వాత వచ్చిన భారీ కంబ్యాక్. ఈ సినిమాలో ఆయన మాజీ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించారు. కథ ప్రకారం, పది సంవత్సరాల తర్వాత ముంబై అండర్ వరల్డ్‌లోకి తిరిగి వచ్చి శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటాడు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.

ఇక సుజీత్ తన తదుపరి సినిమాను నేచురల్ స్టార్ నానితో చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటించనున్నారు. ఇక అభిమానులు ఇప్పటికే 'OG పార్ట్ 2' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు