Jalsa Re Release: సంజయ్ సాహు తిరిగొస్తున్నాడు. ‘జ‌ల్సా’ రీ-రిలీజ్‌.. ఎప్పుడంటే..?

పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమా మళ్లీ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మొదట సెప్టెంబర్ 2కు ప్లాన్ చేసిన రీ రిలీజ్ వాయిదా పడగా, ఇప్పుడు డిసెంబర్ 31న విడుదల చేయనున్నట్లు సమాచారం. సంజయ్ సాహు పాత్ర, డైలాగ్స్, దేవిశ్రీ సంగీతంతో ఈ సినిమా కల్ట్ హిట్‌గా నిలిచింది.

New Update
Jalsa Re Release

Jalsa Re Release

Jalsa Re Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అభిమానులకు మరోసారి సంజయ్ సాహు తెరపై కనిపించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ప్రత్యేక స్థానం దక్కించుకున్న ‘జల్సా’ సినిమా మళ్లీ థియేటర్లలో విడుదల కానుంది. మొదట పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అదే నెల 25న ‘OG’ సినిమా విడుదల ఉండటంతో అభిమానులు దీనిని డబుల్ ట్రీట్‌గా భావించారు.

Jalsa Re Release on Dec 31

అయితే అనుకోని కారణాలతో ఆ ప్లాన్ మారిపోయింది. అల్లు అర్జున్ కుటుంబంలో జరిగిన విషాద ఘటన కారణంగా ‘జల్సా’ రీ రిలీజ్ వాయిదా పడింది. దీంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, డిసెంబర్ 31న ‘జల్సా’ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫుల్ సాంగ్ రిలీజై మంచి రెస్పాస్ అందుకుంటుంది. ఇలాంటి టైమ్ లో జల్సా సినిమా రీ రిలీజ్ కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా డబుల్ ట్రీట్‌లా మారనుంది.

‘జల్సా’ సినిమా విడుదలైన సమయంలో ఊహించినంత భారీ స్పందన రాలేదన్న మాట నిజమే. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా బాగానే నిలబడింది. కాలం గడిచే కొద్దీ ఈ సినిమాకు క్రేజ్ పెరిగింది. ఇప్పటికీ టీవీల్లో లేదా ఓటిటీల్లో వచ్చినప్పుడు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తుంటారు. అందుకే ఈ సినిమాను ఇప్పుడు చాలామంది కల్ట్ బ్లాక్ బస్టర్గా అంటుంటారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కోసం డిజైన్ చేసిన సంజయ్ సాహు పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పవన్ ఎన్నో పాత్రలు చేసినా, ఈ క్యారెక్టర్ మాత్రం అభిమానుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ముఖ్యంగా త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంటాయి.

ఇక సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ అప్పట్లోనే సినిమాకు మంచి హైప్ తెచ్చింది. ఆల్బమ్‌లోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. పాటలు, డైలాగ్స్, పవన్ స్టైల్ కలిసి ‘జల్సా’ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇప్పుడు ఈ సినిమా మళ్లీ థియేటర్లలో వస్తుండటంతో పవన్ అభిమానుల్లో ఉత్సాహం మరోసారి పెరిగింది.
 

Advertisment
తాజా కథనాలు