Ram Charan: ప్రభాస్ డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా రాబోతోంది. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో రానుందని సమాచారం. డివివి ఎంటర్టైన్మెంట్స్ డి.వి.వి. దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.

New Update
Ram Charan

Ram Charan

Ram Charan: ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu) సానా  కాంబోలో RC 16 తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే,  ఈ చిత్రం పట్ల ఎప్పటికప్పుడు అనేక పుకార్లు పుడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ లో ధోని నటిస్తున్నారన్న వార్త ఒకటి ఫుల్ వైరల్ అయ్యింది. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని మూవీ టీం స్పష్టత ఇచ్చింది.

Also Read: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై RGV షాకింగ్ కామెంట్స్..

ఏదేమైనప్పటికీ ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే , రామ్ చరణ్  గేమ్ ఛేంజర్ నిరాశ పరచడంతో ఇప్పుడు ఫ్యాన్స్ అంచనాలన్నీ ఈ మూవీ పై ఉన్నాయి. ఈ సినిమా తర్వాత చరణ్ లైనప్‌లో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సుకుమార్ తప్ప, మరో దర్శకుడు పేరు లేదు.

Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

ప్రశాంత్ నీల్ తో  రామ్ చరణ్ ఫిక్స్..?

అయితే, తాజాగా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో  రామ్ చరణ్(Ram Charan) పనిచేసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ కాంబో కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో రానుందని సమాచారం. "RRR" లాంటి సెన్సేషనల్ హిట్ ను నిర్మించిన డివివి ఎంటర్టైన్మెంట్స్ మళ్ళీ రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ మూవీ ని కూడా నిర్మించనున్నట్లు సమాచారం వస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై  మరింత వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.

Also Read: "ఛీ ఛీ చండాలం.. యాడ దొరికిన సంతరా ఇది".. ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ రీల్స్ పై నెటిజన్స్ ఫైర్!

Also Read: NTR- Nelson Movie: ఎన్టీఆర్- నెల్సన్ మూవీకి 'ROCK' ఇంగ్ టైటిల్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు