/rtv/media/media_files/2025/03/21/hP1ljEuc3vBTHLbp4yP7.jpg)
NTR- Nelson Movie
NTR- Nelson Movie: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ "డ్రాగన్". ఇది 1960 టీమ్ పీరియడ్ లో కోల్‌కత్తా బ్యాక్ డ్రాప్ లో జరిగే కథగా తెలుస్తోంది. యాక్షన్, రాజకీయం నేపథ్యంలో సాగే కథతో రూపొందుతుంది "డ్రాగన్". రీసెంట్ గా తమిళ్, తెలుగులో "డ్రాగన్" అనే పేరుతో ప్రదీప్ రంగనాధన్ హీరోగా సినిమా రిలీజయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. అయితే మరి ఎన్టీఆర్ సినిమాకి "డ్రాగన్" అనే టైటిల్ ఉంచుతారా లేదా మార్చేస్తారా అని అంతటా సందేహం నెలకొంది. అయితే దీనిపై స్పందిస్తూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.
Also Read: "టాక్సిక్"గా అదరగొడుతున్న రాకీ భాయ్..
'రాక్' టైటిల్ ఫిక్స్..?
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ కొత్త సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మించబోతుందని సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కూడా ఫైనల్ అయిందట ఎన్టీఆర్ క్రేజ్ కి తగ్గట్టుగా ఈ మూవీకి 'రాక్' అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది.
Also Read: "ఛీ ఛీ చండాలం.. యాడ దొరికిన సంతరా ఇది".. ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ రీల్స్ పై నెటిజన్స్ ఫైర్!
అయితే ప్రస్తుతం నెల్సన్ రజినీకాంత్ తో జైలర్ 2ని తెరకెక్కిస్తున్నారు, ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఆ చిత్రం పూర్తి అయిన తర్వాత, నెల్సన్ ఎన్టీఆర్ మూవీపై దృష్టి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2026 ప్రారంభంలో పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించబోతున్నారు.
Also Read: ఇది రియలైజేషన్ అంటే..! తప్పు ఒప్పుకున్న అనన్య నాగళ్ల
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!