సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే 'విరూపాక్ష' అనే హారర్ థ్రిల్లర్ గా భారీ హిట్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు మరో విభిన్న తరహా కథతో రాబోతున్నాడు. ఈసారి యోధుడిగా అలరించబోతున్నాడు. సాయి తేజ్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'SDT18'. ‘హనుమాన్’ వంటి పాన్ ఇండియా మూవీని నిర్మించిన కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ చిత్రంతో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నారు. నేడు సాయి తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. 'ధైర్యాన్ని తన కవచంగా, ఆశయే ఆయుధంగా.. అతడు చివరిగా నిలబడి ఉన్నాడు..' అంటూ తిరుగులేని మెగా సుప్రీమ్ హీరోకి మూవీ టీం శుభాకాంక్షలు తెలియజేసింది.
With courage as his shield and hope as his weapon,
— Primeshow Entertainment (@Primeshowtweets) October 15, 2024
he’s the last one standing ✊🏻
Team #SDT18 wishes the indomitable Mega Supreme Hero @IamSaiDharamTej a powerful birthday ❤️🔥
Here’s a special INTRUDE INTO THE WORLD OF ARCADY🔥
-- https://t.co/rsCq4SDIq6
THIS IS JUST THE… pic.twitter.com/SB8ESmEKwF
యోధుడిగా..
సాయి ధరమ్ తేజ్ పవర్‌ఫుల్ పుట్టినరోజు సందర్భంగా ఆర్కాడీ ప్రపంచంలోకి ప్రత్యేక ప్రవేశం.. అంటూ విడుదల చేసిన గ్లింప్స్‌లో సాయి దుర్గ తేజ్ కండలు తిరిగిన దేహంతో శక్తివంతమైన శూలాన్ని పట్టుకొని కనిపించాడు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందని వీడియో చూస్తే అర్థమవుతుంది. సినిమాలో సాయి తేజ్ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అందుకు తగ్గట్టే తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నాడు.
Also Read : ప్లాపులతో పనిలేదు.. వరుస ఆఫర్లు కొట్టేస్తున్న బ్యూటీ.. ఆ హీరోయిన్ మరెవరో కాదు?
ఇక ఈ వీడియోను చూసిన మెగా ఫ్యాన్స్ సాయి తేజ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి షాక్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ మూవీతో సాయి తేజ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరడం గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీలో ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.