HBD Superstar Rajinikanth: హ్యాపీ బర్త్ డే తలైవా..! స్టైల్‌, స్వాగ్‌, మ్యానరిజమ్స్‌కి వన్‌ & ఓన్లీ సూపర్‌స్టార్‌.

భారత సినీ ప్రపంచంలో సూపర్ స్టార్ అనగానే గుర్తొచ్చే ఏకైక పేరు రజనీకాంత్ 75వ పుట్టినరోజు సందర్భంగా, ఆయన బస్ కండక్టర్‌గా మొదలైన సాధారణ జీవితం నుంచి ప్రపంచ స్టార్‌గా ఎదిగిన ప్రయాణాన్ని, ఆయన స్టైల్‌, సింపుల్ నడవడిక ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

New Update
Rajinikanth Birthday Special

HBD Superstar Rajinikanth

HBD Superstar Rajinikanth: భారత సినీ ప్రపంచానికి సూపర్ స్టార్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది రజనీకాంత్(Rajinikanth). ఈ పేరుకు ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఆయన స్టైల్, ఆయన మాట తీరు, ఆయన సింపుల్ జీవితం ఇవన్నీ ఆయనను ‘సూపర్ స్టార్’గా నిలబెట్టాయి.

ఈ రోజు ఆయన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంలో, రజనీ జీవితం ఎలా మొదలైందో, ఆయన చిన్ననాటి రోజులు ఎలా గడిచాయో ఈ స్పెషల్ స్టోరీలో(Rajinikanth Birthday Special) తెలుసుకుందాం.

బెంగళూరులో జన్మించిన రజనీకాంత్..  

రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఆయన డిసెంబర్ 12, 1950 న బెంగళూరులో ఒక మధ్యతరగతి మారాఠీ కుటుంబంలో జన్మించారు. ఆయన కుటుంబంలో పెద్దగా ధనం లేదు. సాధారణ ఉద్యోగాలు చేసే కుటుంబం.

తండ్రి: రామోజి రావు గైక్వాడ్, పోలీస్ కానిస్టేబుల్

తల్లి: జిజాబాయి, గృహిణి

తమ్ముళ్లు, అక్క ఉన్న కుటుంబం

చిన్ననాటి నుంచే రజనీ చాలా సరదాగా ఉండే వ్యక్తి. అయితే తల్లి చనిపోవడం ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి కాస్త కష్టాల్లో పడింది.

Also Read: తలైవా ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. ‘నరసింహ’ మళ్లీ థియేటర్లలో..!

బాల్యం & చదువు బెంగళూరులోనే ( Rajinikanth Childhood & Education )

రజనీ తన మొత్తం బాల్యం బెంగళూరులోనే గడిపాడు. ఆయన మెరిట్ విద్యార్థి కాకపోయినా, మంచి డిసిప్లిన్ ఉన్న బాలుడు. చదువు కంటే ఆటలు, డ్రామాలు, చిన్న చిన్న యాక్టింగ్ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆయనకు బాగా ఇష్టం. పాఠశాల సమయంలోనే ఆయనలో నటనా ప్రతిభ కనిపించేది. స్కూల్ డ్రామాల్లో చిన్న పాత్రలు పోషించేవాడు. ఆ స్టేజ్ మీద నిలబడినప్పుడు ఆయన చూపే ఎనర్జీని చూసి టీచర్లు కూడా ఆశ్చర్యపోయేవారు.

బస్ కండక్టర్ గా రజనీ

చదువు పూర్తయ్యాక, ఇంటి పరిస్థితులు సహకరించకపోవడంతో రజనీ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అప్పుడే ఆయనకు బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్‌లో బస్ కండక్టర్ ఉద్యోగం వచ్చింది. ఇదే ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన దశ. రజనీ కండక్టర్‌గా పనిచేసినప్పుడు, ప్యాసింజర్లతో చాలా వినయంగా మాట్లాడేవాడు. టికెట్లు ఇచ్చే స్టైల్ అందరినీ ఆకట్టుకునేది. ఆయన డ్రెస్ స్టైల్ కూడా ప్రత్యేకమే. అమ్మాయిలకైతే ఆయన ఓ స్టార్‌లాంటి వాడే.  బస్ కండక్టర్‌గా ఉన్నప్పుడే ఆయనలోని స్టార్ క్వాలిటీ బయటపడింది. ఒక సాధారణ బస్‌ కండక్టర్ లోనూ అంత స్టైల్? అంటే ఇది రజనీ ప్రత్యేకత మాత్రమే.

అదే సమయంలో ఆయనకు నటనపై ఉన్న పిచ్చి మాత్రం తగ్గలేదు. తను సంపాదించిన జీతం నుంచి కొంత సొమ్ము సేవ్ చేస్తూ, ఫ్రీ టైంలో థియేటర్ క్లాసులు కూడా జాయిన్ అయ్యాడు.

నటనపై ఉన్న ప్రేమ రజనీని చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ వరకు తీసుకెళ్లింది. అక్కడ చేరడానికి కూడా ఆయనకు చాలా కష్టపడ్డారు కుటుంబం ఒప్పించాలి, ఫీజు కోసం సొమ్ము పోగు చేయాలి. చివరికి ఆయన ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్ తీసుకొని శిక్షణ ప్రారంభించాడు. ఇక్కడే ఆయన జీవితంలో ఒక సూపర్ టర్నింగ్ పాయింట్ జరిగింది…

Also Read: హార్ట్ పేషెంట్స్ ఈ సినిమా అస్సలు చూడకండి: 'ఈషా' మూవీ టీమ్

రజనీ జీవితాన్ని మార్చిన వ్యక్తి  దర్శకుడు కె.బాలచందర్

ఒక స్టేజ్ ప్రదర్శన చూసిన కే.బాలచందర్ గారు, రజనీకాంత్‌లో ఉన్న అద్భుతమైన ఎనర్జీ, యాక్టింగ్ సామర్థ్యం గుర్తించారు. కె.బాలచందర్ చెప్పిన మాట -
“నీకు నటన రక్తంలో ఉంది. నీ పేరు రజనీకాంత్. నువ్వు ఒక రోజు పెద్ద స్టార్ అవుతావు.” అని అన్నారు. చివరకు అది నిజమే అయింది! బాలచందర్ గారు ఆయనను అపూర్వ రాగాలు (1975) సినిమా ద్వారా తమిళ సినిమా ప్రపంచంలోకి తీసుకువచ్చారు. అప్పుడు రజనీ చిన్న పాత్రలో నటించాడు. కానీ స్క్రీన్ మీద ఆయన కనిపించిన క్షణం నుంచే ప్రజలు ఆయనను గుర్తించడం మొదలుపెట్టారు.

సినిమా ప్రపంచంలో తొలి అడుగులు - సహాయ పాత్రల నుంచి సూపర్ స్టార్ వరకు

1975లో వచ్చిన అపూర్వ రాగాలు రజనీ చేసిన తొలి చిత్రం. ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రలో కనిపించాడు. స్క్రీన్ మీద కేవలం కొద్ది నిమిషాలు ఉన్నా, ఆయన చూపించిన డైలాగ్  డెలివరీ, కళ్లతో ఆయన చూపించే హావభావాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దాంతో దర్శకులు రజనీకి మరిన్ని పాత్రలు ఇవ్వడం మొదలుపెట్టారు.

1975-1978 మధ్య రజనీకాంత్ లైఫ్ స్టైల్ ఇలా.. 

1975-1978 మధ్య రజనీ 50కి పైగా సినిమాల్లో నటించాడు. ఎక్కువగా నెగటివ్ రోల్ లేదా గంభీరమైన పాత్రలు పోషించారు. స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆ సమయంలో రజనీ ఏ సినిమాల్లో నటించినా ఆయన స్టైల్, డైలాగ్స్  స్పెషల్ గా నిలిచేవి.

Also Read: 'అఖండ 2' దెబ్బ.. రోషన్ కనకాల 'మోగ్లీ' తట్టుకుంటుందా?

మొదటి హీరో పాత్ర  ‘బైరవి’ (1978)

1978లో వచ్చిన బైరవి రజనీకాంత్ కెరీర్‌లో పెద్ద మలుపు. ఇదే ఆయనకు తొలి హీరో పాత్ర. ఈ సినిమా విడుదలై ఆయనకు అభిమానులను తెచ్చిపెట్టింది. అప్పట్నుంచే ఆయనకు పెట్టిన బిరుదు “SUPERSTAR RAJINIKANTH”. ఈ బిరుదు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరూ తీసుకోలేరు, ఎవరికి ఇవ్వలేరు, ఎందుకంటే ఇది రజనీకి మాత్రమే సరిపోయే బిరుదు.

తొలి విజయాలు..  

బైరవి తర్వాత రజనీ వరుస విజయాలు అందుకున్నాడు

ముళ్ల మలార్ (1978)

రజనీకాంత్ నటనకి ప్రశంసలు అందుకున్న సినిమా ముళ్ల మలార్. కుటుంబ కథలో ఆయన భావోద్వేగం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటన పరంగా రజనీ ఎంత లోతుగా నటించగలడో ఈ సినిమా చూపించింది.

మూండ్రు ముగం (1982)

ఈ సినిమాలో మూడు పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు రజినీకాంత్. ఆయన వేషధారణ, డైలాగ్ డెలివరీ, యాక్షన్  అన్నీ అద్భుతంగా పండాయి.

Aarilirunthu Arubathu Varai (1979)

పేద బాలుడు నుంచి పెద్ద వ్యక్తిగా ఎదిగే ఎమోషనల్ కథ ఈ సినిమా రజనీ నటుడిగా ఉన్న బలాన్ని నిరూపించింది. ఈ సినిమాలు రజనీకాంత్‌ను హీరోగా నిలబెట్టాయి. ప్రేక్షకులు ఆయనను కేవలం యాక్షన్ స్టార్ గా మాత్రమే కాదు, ఒక మంచి నటుడిగానూ చూశారు.

రజనీ స్టైల్ ఎందుకు ప్రత్యేకం?

రజనీకాంత్‌కి ఉన్న ప్రత్యేకత మరెవరికి లేదు. సిగరెట్‌ని తిప్పి నోట్లో వేసే స్టైల్,  గ్యాంగ్ పైకి వెళ్లేటప్పుడు చేసే వాక్,  హ్యాండ్ మూవ్‌మెంట్స్, కళ్ళతో చేసే యాక్టింగ్. ఆయన మ్యానరిజమ్స్ సింపుల్‌గా కనిపించినా, వాటికి ఉన్న కట్టిపడేసే అందం వేరే. అందుకే ఆయన స్టైల్‌ను ప్రపంచం అంతా ప్రేమిస్తుంది. 1980 నుంచి 1990 మధ్య రజనీ కెరీర్ శిఖరాగ్రానికి చేరుకుంది. తమిళ సినిమా ప్రపంచంలో ఆయనకు వచ్చిన క్రేజ్ ఊహించలేనిది. ఈ టైం పీరియడ్ లో ఆయనకు వరుస హిట్లు వచ్చి పడ్డాయి. హీరోగా భారీ ప్రజాదరణ లభించింది. పెద్ద బడ్జెట్ సినిమాలు చేసే అవకాశం లభించింది.  భారీ డిస్ట్రిబ్యూటర్ రేంజ్ దక్కింది.

Also Read: ఆది పినిశెట్టి నెక్స్ట్ లెవెల్ ప్లాన్..! ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్..

రజినీ కొన్ని ముఖ్యమైన సినిమాలు..

  • అన్నామలై
  • Nallavanuku Nallavan
  • తిల్లూ ముళ్ళు (కామెడీలో రజనీని కొత్తగా చూపించింది)

ఈ హిట్లతో రజనీకాంత్ పేరు దక్షిణ భారతదేశం మొత్తానికి వ్యాపించింది.

బాషా (1995) - రజనీని దేవుడిలా చేసిన సినిమా

1995లో వచ్చిన బాషా సినిమా రజనీకాంత్‌ను ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలబెట్టింది. ఈ సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్స్, ఆయన నటన, ఆయన లుక్ ఇవన్నీ పాపులర్ అయ్యాయి.

"బాషా ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే!" లాంటి డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

సినిమా విడుదల రోజున థియేటర్ల ముందు ప్రజలు పాలాభిషేకం చేశారు. ఇది రజనీ పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం. రజనీ స్టార్‌డమ్ తరువాత ఆయన కెరీర్‌లో మరిన్ని భారీ సినిమాలు వచ్చాయి.

శివాజీ (2007) - శంకర్ దర్శకత్వంలో

ఆ సమయంలో భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్న తొలి భారతీయ నటుడు.

‘రొబో / ఎంథిరన్ (2010)’

  • రజనీ రెండు పాత్రలు
  • ఆశ్చర్యపరిచే నటన
  • భారీ విజువల్ ఎఫెక్ట్స్
  • బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్

2.0 (2018)

  • భారీ బడ్జెట్
  • హాలీవుడ్ రేంజ్ టెక్నాలజీ
  • ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

ఈ సినిమాలు రజనీని గ్లోబల్ స్టార్‌గా మార్చాయి.

బాలీవుడ్‌లోకి రజనీకాంత్ - దేశం మొత్తం గుర్తించిన స్టార్

1980ల చివర్లో దక్షిణ భారత ప్రేక్షకులు రజనీని దేవుడిలా చూడసాగారు. అతని సినిమాలు ఏ భాషలో వచ్చినా పాపులర్ అవడంతో బాలీవుడ్ నిర్మాతల దృష్టి రజనీపై పడింది.

రజనీ హిందీ ఎంట్రీ - అంధా కానూన్ (1983)

రజనీ నటించిన తొలి హిందీ సినిమా అంధా కానూన్. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ & హేమా మాలిని కూడా నటించారు. అప్పట్లో ఈ సినిమా భారీ హిట్ అయ్యింది. దాదాపు 50 వారాలు థియేటర్లలో నడిచింది. ఈ సినిమా రజనీకి ఉత్తర భారతదేశంలో కూడా మంచి ఫ్యాన్ బేస్‌ని ఇచ్చింది. రజనీ కెరీర్‌లో మరో ముఖ్యమైన భాగం దర్శకుడు SP ముత్తురామన్ & రజనీ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి 20కి పైగా చిత్రాలు చేశారు. రజనీకి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత పెంచే పాత్రలు ఇచ్చారు. ఎన్నో బ్లాక్‌బస్టర్లను అందించారు. ఈ జంట తమిళ ఇండస్ట్రీలో ఐకానిక్ కాంబినేషన్‌గా మారింది. రజనీ స్టంట్ సీన్స్‌కి కూడా ప్రసిద్ధుడు. దక్షిణ భారతదేశంలో కదిలే రైలు మీద ఫైట్ సీన్‌ను బాడీ డబుల్ లేకుండా చేసిన తొలి హీరో ఫైట్లు, యాక్షన్‌లో సహజత్వం చూపిన నటుల్లో రజనీ ముందువరుసలో ఉంటారు. ఇలాంటి అద్భుతాలే రజనీని ప్రత్యేక నటుడిగా నిలబెట్టాయి.

Also Read: అన్నగారికి రిలీజ్ కష్టాలు.. ఇప్పట్లో విడుదల లేనట్లేనా?

రజనీ ఆరోగ్యం

ఎక్కువ సినిమాలు చేస్తూ, ఎక్కువ శ్రమతో పనిచేస్తూ ఉన్న టైమ్ లోనే 2011 సమయంలో రజనీకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయి. కిడ్నీ పనితీరు బలహీనపడటం. డయాలిసిస్ సరిగా పనిచేయకపోవడంతో సింగపూర్‌లో ప్రత్యేక చికిత్స జరిగింది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రజనీ ఆ పరిస్థితిని ధైర్యంతో ఎదుర్కొని పూర్తిగా కోలుకున్నారు. తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చి భారీ విజయాలను సాధించారు.

సోషల్ మీడియాలో ఎంట్రీ - ఒక్కరోజులో ల్యాక్షల ఫాలోవర్స్

రజనీ చాలా ప్రైవేట్ వ్యక్తి. ఆయన సోషల్ మీడియాలోకి రావడం అసలు ఊహించలేదు అభిమానులు. కాని 2014లో అకస్మాత్తుగా Twitter (ఇప్పుడు X)లోకి వచ్చారు. అయితే ఆయన Twitterలోకి వచ్చిన వెంటనే ఏమైందో తెలుసా? ఒక్కరోజులోనే 1.5 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. దింతో రజిని మళ్ళీ ట్రెండింగ్ టాపిక్ అయ్యారు. ఆయన సోషల్ మీడియాలోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఒక్క ఉదాహరణతో ఆయన పాపులారిటీ ఎంత అద్భుతమో అర్థమవుతుంది.

జపాన్ వరకూ వెళ్ళిన రజనీ క్రేజ్

రజనీ సినిమాలు భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా భారీగా ఆదరిస్తారు. జపాన్‌లో ‘ముత్తు’ మూవీ సునామీ సృష్టించింది. ‘ముత్తు’ జపాన్‌లో అసాధారణంగా పెద్ద హిట్ అయ్యింది. రజనీకి అక్కడ ప్రత్యేక అభిమాన వర్గం సంపాదించి పెట్టింది.  పుట్టినరోజుల లాంటి సందర్భంలో పెద్ద బ్యానర్లు పెట్టి సెలెబ్రేట్ చేస్తారు. సినిమాలు రిలీజ్ అయితే జపాన్‌లో పండగ వాతావరణం ఉంటుంది. దక్షిణ భారత నటులకు విదేశాల్లో ఇంత క్రేజ్ రావడం అరుదైన విషయం. 2023లో వచ్చిన జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹500 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. రజనీ స్టైల్, డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అందరిని ఆకట్టుకున్నాయి. వయసు 75 అయినా రజనీ ఎనర్జీ మాత్రం యువ హీరోలతో సమానంగా ఉందని జైలర్ నిరూపించింది.

రజినీకాంత్ 75వ పుట్టినరోజు (Rajinikanth 75th Birthday)

డిసెంబర్ 12, 2025… ఈ రోజు రజనీ 75వ ఏట అడుగుపెడుతున్నారు. అభిమానులకు ఈ రోజు పండగ కంటే ఎక్కువ. తమిళనాడు నుంచి విదేశాల వరకు ప్రత్యేక ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు, పూజలు, కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇలా అనేక కార్యక్రమాలతో అన్ని చోట్లా రజనీ పేరు మాత్రమే వినిపిస్తోంది.

‘పడయప్ప/నరసింహ’ రీరిలీజ్ 

రజనీ పుట్టినరోజు సందర్భంగా, 1999లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘నరసింహ’ (తమిళంలో Padayappa) మళ్లీ థియేటర్లకు వస్తోంది.

రీరిలీజ్ ప్రత్యేకతలు:

4K Ultra HD & మెరుగైన డిజిటల్ సౌండ్ తో సినిమా పూర్తి రీస్టోర్ చేసి  పాత క్లాసిక్‌కు కొత్త లుక్ యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ప్రేక్షకులు 25 ఏళ్ల తర్వాత సినిమా మళ్లీ పెద్ద తెరపై చూడబోతుండడం వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి.

పడయప్ప ట్రైలర్ విడుదల 

డిసెంబర్ 10న విడుదలైన ట్రైలర్ అభిమానుల్లో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ట్రైలర్‌లో రజనీ స్టైల్ డైలాగ్స్, రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్ర, ఏ.ఆర్. రెహమాన్ రీ-మిక్స్ BGM అన్నీ కలిసి పాత జ్ఞాపకాలను తిరిగి తెచ్చాయి.

రజనీ ప్రత్యేక వీడియో - ‘నీలాంబరి’ సీక్వెల్ అనౌన్స్

రీ-రిలీజ్ స్పెషల్ వీడియోలో రజనీ స్వయంగా ‘నీలాంబరి’ సీక్వెల్ అనౌన్స్ చేసారు. అయితే పడయప్ప 2 టైటిల్ వద్దు అనుకున్నాం. అందుకే నీలా౦బరి అనే టైటిల్‌తో సీక్వెల్ తీసుకురావాలని నిర్ణయించాం.” అని రజినీ అన్నారు ఈ మాటలతో అభిమానుల్లో భారీ సంబరాలు మొదలయ్యాయి.

Also Read: 'ఆద‌ర్శ కుటుంబం హౌస్ నెంబ‌ర్ 47' వెంకీ మామ వచ్చేశాడోచ్..!!

సీక్వెల్ పేరు ‘నీలాంబరి’? (Rajinikanth Narasimha Movie Sequel)

ఎందుకంటే… నరసింహ సినిమా మొత్తం నిలబెట్టింది నీలాంబరి పాత్ర, రమ్యకృష్ణ చేసిన నటన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. టాలీవుడ్, కొలీవుడ్, బాలీవుడ్ మూడు ఇండస్ట్రీలలో కూడా ఆ పాత్రకు ప్రత్యేక క్రేజ్ ఉంది.  అందుకే సీక్వెల్‌ను ఆ పేరుతో తీసుకురావడం అభిమానులకు మరింత ఎగ్జైట్‌మెంట్ ఇచ్చింది. రిలోడ్ అయిన ట్రైలర్, రీరిలీజ్, సీక్వెల్ అనౌన్స్… ఇవి అన్నీ కలిసి రజనీ అభిమానులను ఆనందంలో ముంచేశాయి. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, దుబాయ్, టోక్యో ఇలా అనేక చోట్ల ఫ్యాన్స్ పెద్ద వేడుకలు చేస్తున్నారు.

రజనీ కెరీర్‌కు ‘నరసింహ’ ఎందుకు ప్రత్యేకమంటే?

కుటుంబం, ఆత్మగౌరవం, విలన్‌తో పోరు వంటి విషయాలతో సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రజనీ - నీలాంబరి కాంబినేషన్ సినిమా హైలైట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇందుకే 26 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమాకు అదే క్రేజ్ ఉంది.

రజనీ రాబోయే సినిమాలు 

రజనీ ప్రస్తుతం జైలర్ 2,  నీలాంబరి (Padayappa 2) ఇలా వరుసగా భారీ సినిమాలతో వస్తున్నారు. ప్రతి సినిమా పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు తెచ్చుకుంటోంది.

రజనీ బెస్ట్ సినిమాలు..  తప్పకుండా చూడాల్సిన 10 హిట్ మూవీస్

అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే రజనీ సినిమాలు ఇవి. ఇప్పుడు OTTలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరూ చూసేయండి.

1. జైలర్ (2023)

OTT: Amazon Prime
రజనీ మళ్లీ భారీ హిట్ ఇచ్చిన సినిమా. రిటైర్డ్ జైలర్ తన కొడుకు కోసం చేసే పోరాటం ప్రధాన కథ.

2. అన్నాత్తే (2021)

OTT: Netflix
అన్నా-చెల్లెలు బంధాన్ని చూపే ఈ సినిమా భావోద్వేగం, యాక్షన్ రెండింటినీ కలిపింది.

3. రోబో / ఎందిరన్ (2010)

OTT: Prime Video
రజనీ ద్విపాత్రాభినయం- డాక్టర్ వశీకరణ్ & రోబో చిట్టి. భారత సినిమా గ్రాఫిక్స్‌కు కొత్త దశ చూపిన సినిమా.

4. శివాజీ: ది బాస్ (2007)

OTT: Prime Video / ZEE5
కరప్షన్ పై పోరాడే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కథ. రజనీ స్టైల్ భారీగా కనిపించిన సినిమా.

5. కబాలి (2016)

OTT: Hotstar / JioCinema
మలేసియాలో సెట్ చేసిన గ్యాంగ్‌స్టర్ డ్రామా. రజనీ ఎమోషనల్ టచ్ చూపించిన హిట్ సినిమా.

6. పేట (2019)

OTT: Netflix
రజిని యంగ్ స్టైల్ మళ్లీ చూపించిన సినిమా. విలన్స్‌తో రజనీ పోరు కథలో ముఖ్య ఆకర్షణ.

7. దర్బార్ (2020)

OTT: Prime Video
రజనీ పోలీస్ రోల్‌లో యాక్షన్‌తో ఆకట్టుకున్న సినిమా.

8. కూలీ (2024)

OTT: Prime Video
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రజనీకి పాన్-ఇండియా స్థాయి క్రేజ్ తెచ్చింది.

9. 2.0 (2018)

OTT: Prime Video
రోబో సిరీస్ రెండో భాగం. అక్షయ్ కుమార్ విలన్ పాత్ర హైలైట్ గా నిలిచింది.

10. నరసింహ / పడయప్ప (1999)

థియేటర్లలో రీరిలీజ్ (4K) రజనీ కెరీర్‌లోనే భారీ స్థాయి కుటుంబ–యాక్షన్ డ్రామా. రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్ర ఇప్పటికీ బెస్ట్ విలన్‌గా నిలిచింది. 

రజనీ అసలు రూపం తన సినిమాల్లో కాదు ఆయన వ్యక్తిత్వంలో ఉంది. అందుకే అభిమానులు ఆయనను దేవుడిలా చూస్తారు.

1. అహంకారం లేని మనిషి

సూపర్‌స్టార్ అయినా ఇంట్లో చాలా సాదాసీదాగా ఉంటారు.

2. సాధారణ ఆచారాలు

ఆయన ఆధ్యాత్మికత ఎక్కువ. ఉదయం ధ్యానం, యోగా తప్పకుండా చేస్తారు.

3. పెద్ద మనసు

అనేక దానధర్మాలు చేశారు కానీ ఎప్పుడూ ప్రచారం చేయరు.

4. అభిమానులను కుటుంబంలా చూసుకుంటారు

సినిమా బయట కూడా వారి సమస్యలు తెలుసుకుని సహాయం చేస్తారు.

5. సంక్షోభాల్లో కూడా చిరునవ్వు

దీర్ఘకాలిక అనారోగ్యం వచ్చినా ధైర్యంగా ఎదిరించి తిరిగి సూపర్ హిట్స్ ఇచ్చారు.

6. ఏనాడూ ఎవరి గురించి చెడ్డ మాట మాట్లాడరు

పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే వ్యక్తి.

రజనీ సింపుల్ లైఫ్ 

  • సినిమాల్లో స్టైల్… బయట మాత్రం పూర్తిగా సింపుల్
  • లగ్జరీ కార్ల కన్నా సాధారణ వాహనాలు ఎక్కువ ఇష్టపడతారు.
  • ఖరీదైన స్టైల్ కాదు- సాధారణ పంచెకట్టు, షర్ట్
  • రాజకీయాలు, సినిమాల కన్నా ఆధ్యాత్మికతపై ఎక్కువ దృష్టి

ఇది చూసే అభిమానులు ఆయనను ఒక ఆదర్శంగా చూస్తారు.

రజనీ రాబోయే సినిమాలు

రజిని అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఇంకా ఎన్నో భారీ సినిమాలు ఉన్నాయి:

1. జైలర్ 2  నెల్సన్ దర్శకత్వం.

2. నీలాంబరి (పడయప్ప 2) రజనీ స్వయంగా ప్రకటించిన సీక్వెల్. రమ్యకృష్ణ పాత్రకు రీబూట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

3. కూలీ 2 లోకేష్ కనగరాజ్ యూనివర్స్ లో కీలక స్థానం పొందే అవకాశం.

రజనీకి ఎందుకు ఎప్పటికీ తగ్గని క్రేజ్ ఎందుకంటే రజనీ అంటే… సినిమా స్టైల్, వ్యక్తిగత జీవితం లో సింపుల్ నడవడిక, అభిమానులపై ప్రేమ, ఆధ్యాత్మికత, కష్టాల్ని ఎదుర్కొని మళ్లీ లేచే శక్తి ఇవి అన్నీ కలిపి ఆయనను “సూపర్‌స్టార్” కాకుండా “లెజెండ్”గా నిలిపాయి.

రజనీకాంత్ జీవిత తత్వం ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. రజనీకాంత్ జీవితం ఒక పెద్ద పాఠం. ఆయన అనుసరించే కొన్ని ముఖ్యమైన జీవన సూత్రాలు ఇవి

1. సాధారణంగా ఉండటం

ప్రపంచం ఆయనను సూపర్‌స్టార్‌గా చూస్తున్నా… ఆయన మాత్రం ఎక్కువ మాటలు, స్టైల్, వైభవం ఇవేవీ జీవితంలో అనుసరించరు. సాదాసీదాగా జీవించడం ఆయన తత్వం.

2. కృతజ్ఞత

తనకు వచ్చిన పేరే గాని, ధనమే గాని ఎప్పుడూ తాను చేసిన శ్రమకే కాదు…
దైవానుగ్రహం అని గుర్తుంచుకుంటారు.

3. స్వీయ నియంత్రణ

పని, విశ్రాంతి, ఆహారం, ఆధ్యాత్మికత అన్నింటిలో ఆయనకు ఒక పట్టుదల ఉంటుంది.

4. ధైర్యం

ఆరోగ్య సమస్యలు వచ్చినా, కెరీర్‌లో కష్టాలు వచ్చినా… ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు.

5. అహంకారం లేకపోవడం

ఆయన ఎదుగుదలో అహంకారం ఒక్క శాతం కూడా లేదు. ఇదే ఆయనను ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలిపింది.

రజనీ విషయంలో అభిమానులకు ప్రేమ భక్తిలా ఉంటుంది. అందుకు కారణాలు ఇవే:

1. స్టైల్ స్టైల్ స్టైల్

సిగరెట్ తిప్పడం, హ్యాండ్ జర్క్, తిరిగి నడిచే తీరు… అన్నీ ఒక ప్రత్యేక గుర్తింపుగా మారాయి.

2. స్క్రీన్ మీద హీరో… నిజజీవితంలో సూపర్ హీరో

అభిమానుల కోసం డొనేషన్స్, ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం
ఇవన్నీ ఆయన గురించి చెప్పే నిజమైన గుణాలు.

3. జీవిత ప్రయాణం చాలా మందికి ప్రేరణ

బస్ కండక్టర్ నుంచి ప్రపంచ స్టార్ వరకు ఎదగడం ఒక గొప్ప కథ.

రజనీకాంత్ వ్యక్తిగత జీవితం కుటుంబం & సింపుల్ హాబీలు.. భార్య లత రజనీ.. దీర్ఘకాలంగా రజనీకి మద్దతుగా నిలిచిన ముఖ్య వ్యక్తి. ఇద్దరు కుమార్తెలు.. అశ్వినీ- డైరెక్టర్, సౌందర్య-ప్రొడ్యూసర్

హాబీలు

ధ్యానం, సంగీతం వినడం, స్నేహితులతో సింపుల్ టైం స్పెండ్ చేయడం

రాజకీయ ప్రయాణం 

రజనీ 2017లో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. కానీ ఆరోగ్య పరిస్థితులు మంచిగా లేకపోవడం వల్ల ఆ ప్లాన్‌ను మార్చుకున్నారు.

రాబోయే ఏళ్లలో రజనీ నుండి ఏమి ఆశించవచ్చు?

  • మరిన్ని భారీ సినిమాలు
  • కొత్త ప్రయోగాలు
  • యువ దర్శకులతో కలిసి పాన్-ఇండియా ప్రాజెక్టులు
  • ఆధ్యాత్మికం & సమాజ సేవలో మరింత సమయం
  • ఫ్యాన్స్‌తో మరిన్ని కలయికలు & సర్ప్రైజ్‌లు

కష్టపడితే ఎవ్వరి జీవితం అయినా మారుతుందని చెప్పే సాక్ష్యం సూపర్ స్టార్ రజినీకాంత్. అహంకారం లేకపోతే ఎంత ఎత్తుకు వెళ్లినా మనిషి అందరికీ దగ్గరగా ఉంటాడని నిరూపించాడు తలైవా. ఆయన సినిమా, ఆయన వ్యక్తిత్వం, ఆయన ప్రయాణం ఉదయించే సూర్యునిలా ఇంకా చాలా మందికి దారి చూపిస్తూనే ఉంటుంది.. వన్స్ అగైన్ 

హ్యాపీ బర్త్ డే తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ !!

#rajinikanth #Rajinikanth Birthday Special #HBD Superstar Rajinikanth #Rajinikanth Narasimha Movie Sequel #Rajinikanth 75th Birthday
Advertisment
తాజా కథనాలు