Narasimha Re Release: తలైవా ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. ‘నరసింహ’ మళ్లీ థియేటర్లలో..!

సూపర్‌స్టార్ రజనీకాంత్ 75వ జయంతి సందర్భంగా ఆయన హిట్ సినిమా ‘నరసింహ’ మళ్లీ 4కె క్వాలిటీతో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది. అభిమానులు పెద్ద తెరపై సినిమా ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

New Update
Narasimha Re Release

Narasimha Re Release

Narasimha Re Release: తమిళ సినీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ 75వ బర్త్డే(Rajinikanth Birthday) (డిసెంబర్ 12) సందర్భంగా ఆయన అతి పెద్ద హిట్ సినిమా ‘పడయప్ప’(నరసింహ) థియేటర్లలో మళ్లీ విడుదల అవుతుంది. ఈ సినిమా డిజిటల్ గా రీస్టోర్ చేసి, కొత్త సాంకేతికతతో 4కె క్వాలిటీ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు ఆయన అభిమానుల్లో భారీ ఆసక్తి రేపుతోంది.

డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో 1999లో విడుదలైన ‘నరసింహ’ సినిమా సూపర్ హిట్ టాక్ తో, బాక్స్‌ఆఫీస్‌ రికార్డులు సృష్టించింది. అయితే ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రజినీకాంత్ బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ కానుంది.

డిసెంబర్ 10 సాయంత్రం విడుదలైన ట్రైలర్‌ ‘నరసింహ’ అభిమానులను అలరిస్తున్న పంచ్ డైలాగ్స్, మాస్ సీన్స్, ఏ.ఆర్. రహ్మాన్ సంగీతం మళ్ళీ ప్రేక్షకుల్ని ఆకర్షించింది. రజనీకాంత్ స్టైల్ డైలాగ్స్, రమ్య కృష్ణన్ ‘నీలంబరి’ పాత్ర అన్ని ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి.

అంతేకాక, రజనీకాంత్  ‘నరసింహ’పై మాట్లాడిన ప్రత్యేక వీడియో కూడా విడుదలై, అభిమానులలో వైరల్ అయింది. ఇందులో సినిమా తెరకెక్కిన క్షణాలు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్, రమ్య కృష్ణన్‌తో అనుభవాలు రజని పంచుకున్నారు.

రజనీకాంత్ కుమార్తె సౌందర్య రాజనీకాంత్ ఈ రీ-రిలీజ్‌ను అధికారికంగా ప్రకటించి, తన తండ్రి 75వ జన్మదినం సందర్భంగా ఈ సినిమా సంబరాలను ప్రారంభించారని వెల్లడించారు. సమాచారం ప్రకారం, ‘నరసింహ’ రీ-రిలీజ్ కోసం టిక్కెట్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

మొత్తానికి, 25 ఏళ్ల తరువాత పెద్ద తెరపై 4కె క్వాలిటీతో ‘నరసింహ’’ చూడటం అభిమానులకు మరువలేని అనుభవం అవుతుంది. రజనీకాంత్ నటన, ఆయన బాక్స్ ఆఫీస్ స్ట్రెంగ్త్, మాస్ సీన్స్ అన్నీ ఒకసారి మళ్లీ అభిమానులకు సందడిగా మారనున్నాయి.

Advertisment
తాజా కథనాలు