Annagaru Vostaru: అన్నగారికి రిలీజ్ కష్టాలు.. ఇప్పట్లో విడుదల లేనట్లేనా?

కార్తీ 'అన్నగారు వస్తారు’ విడుదల నిర్మాత జ్ఞానవేల్ రాజా చెల్లించని బకాయిల కారణంగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. రూ. 21.78 కోట్ల బకాయి తీర్చే వరకు సినిమా ఏ ప్లాట్‌ఫార్మ్‌లోనూ విడుదల చేయరాదు అని కోర్టు స్పష్టం చేసింది.

New Update
Annagaru Vostaru

Annagaru Vostaru

Annagaru Vostaru: కార్తీ(Karthi) నటించిన ‘వా వాతియార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా విడుదల చివరి క్షణంలో అడ్డంకులు ఎదుర్కొంటోంది. ఇటీవల బాలకృష్ణ  ‘అఖండ 2’ రిలీజ్ ఆగిపోయినట్లే, ఈ చిత్రానికి కూడా నిర్మాత ఆర్థిక సమస్యలు పెద్ద సమస్యగా మారాయి.

ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉంది. కానీ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఫైనాన్సర్‌ కు చెల్లించాల్సిన బకాయిలు ఇంకా ఇవ్వకపోవడంతో, సినిమా విడుదలపై కేసు దాఖలైంది.

కోర్టు తాజా ఆదేశాలు

జ్ఞానవేల్ రాజా ఫైనాన్సర్ అర్జున్‌లాల్ సుందర్ దాస్ కు బకాయిలు క్లియర్ చేసే వరకు సినిమా ఎక్కడా విడుదల చేయకూడదు అని మద్రాస్ హై కోర్ట్ తెలిపింది. 2014లో స్టూడియో గ్రీన్ బ్యానర్ వారు అర్జున్‌లాల్ నుండి రూ. 10.35 కోట్లు అప్పు తీసుకున్నారు. వడ్డీతో కలిపి ఇప్పుడు బకాయి మొత్తం రూ. 21.78 కోట్లకు పెరిగింది.

ఈ విషయంలో కోర్టు ముందే మధ్యంతర స్టే ఇచ్చి జ్ఞానవేల్ రాజాను ఎన్నిసార్లో రీ పే చేసే సమయం అడిగింది. ఏడు అవకాశాలు ఇచ్చినా కూడా ఆయన డబ్బు తిరిగి ఇవ్వలేకపోయారని పిటిషనర్ కోర్టులో తెలిపారు.

నిర్మాత వైపు నుంచి ఏమన్నారంటే

అయితే, నిర్మాత తరఫు న్యాయవాది కోర్టులో చెప్పినదేమంటే, 24 గంటల్లో రూ. 3.75 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని, మిగిలిన మొత్తానికి సంబంధించిన చరాస్థుల పత్రాలు సమర్పిస్తామని తెలిపారు.

అయితే కోర్టు ఈ వివరణను అంగీకరించలేదు. ముందే చాలాసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ బకాయిలు చెల్లించలేదని కోర్టు పేర్కొంది. అందువల్ల సినిమా ఎలాంటి ప్లాట్‌ఫార్మ్‌లోనూ రిలీజ్ చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

దింతో, విడుదల నిలిచిపోవడం తప్ప మరో మార్గం లేదు కోర్టు నిర్ణయంతో ఈ సినిమా విడుదల పూర్తిగా వాయిదా పడింది. బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు కొత్త విడుదల తేదీ ప్రకటించడం అసాధ్యం. త్వరలో సినిమా టీం అధికారిక ప్రకటన ఇవ్వనుంది.

Advertisment
తాజా కథనాలు