/rtv/media/media_files/2025/12/11/aadhi-pinisetty-2025-12-11-15-12-40.jpg)
Aadhi Pinisetty
Aadhi Pinisetty: టాలెంటెడ్ నటుడు ఆది పినిశెట్టి ఈ వారం ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్మెంట్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆయన నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అవుతుండటమే కాదు, రెండు చిత్రాల్లో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒక సినిమాలో హీరోగా, మరొక సినిమాలో విలన్‌గా కనిపిస్తూ అలరించనున్నారు.
అఖండ 2 (Akhanda 2) లో విలన్..
బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న అఖండ 2 చిత్రంలో ఆది ఒక పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే విపరీతమైన హైప్ సృష్టించింది. ఆది పాత్ర ఈ సినిమాలో కథకు కీలకంగా ఉండబోతోందని టాక్.
డ్రైవ్ లో హీరోగా ఆది
ఇదే రోజు రాబోతున్న మరో చిత్రం డ్రైవ్, ఇందులో ఆది యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో హీరోగా కనిపించనున్నాడు. `'ప్రేమమ్' ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్‌గా నటించగా, ఈ చిత్రాన్ని జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో, చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేకెత్తించింది. థ్రిల్లింగ్ నేపథ్యం, ఆది నటన, ఆసక్తికర కథతో ఈ సినిమా ఆడియెన్స్‌కి కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని అనిపిస్తోంది.
ఒకే రోజున రెండు విభిన్న పాత్రలు
డిసెంబర్ 12న థియేటర్లలోకి రాబోతున్న ఈ రెండు చిత్రాలు ఆదిని రెండు పూర్తిగా భిన్నమైన లుక్స్ లో చూపించబోతున్నాయి. ఒక వైపు పవర్‌ఫుల్ నెగటివ్ పాత్ర, మరో వైపు హీరోగా ఉత్కంఠభరిత కథ ఈ రెండింటితో ఆది తన నటన వైవిధ్యాన్ని మళ్లీ రుజువు చేయబోతున్నాడు.
ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయో చూడాలి.
Follow Us