/rtv/media/media_files/2025/12/11/eesha-horror-movie-2025-12-11-16-25-36.jpg)
Eesha Horror Movie
Eesha Horror Movie: హీరోలు అఖిల్ రాజ్, త్రిగుణ్, హీరోయిన్ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న థియేటర్లలోకి రాబోతోంది. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హేమ వెంకటేశ్వరరావు నిర్మించి, ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్ సమర్పించారు.
ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ జరుపుకుంటోంది. ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్ సక్సెస్‌మీట్ను నిర్వహించారు, ఇందులో చిత్ర టీమ్ ప్రేక్షకులను భయపెడుతామని ధైర్యంగా తెలిపారు. ప్రారంభంలో ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలకావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల విడుదలను 25కి వాయిదా వేసారు. అయితే, నిర్మాతలు, సమర్పకులు, హీరోలు మాట్లాడుతూ సినిమా ఖచ్చితంగా బయపెడుతోందని నమ్మకంగా చెప్పారు.
హీరో త్రిగుణ్ మాట్లాడుతూ, హారర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా చాలా నచ్చుతోందని తెలిపారు. హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా సినిమా అద్భుతమని, కథ, దర్శకత్వం, అన్ని బాగా కుదిరాయని తెలిపారు.
నిర్మాత హేమ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, దర్శకుడు మంచి కథతో ఈ సినిమాను మలిచాడు అని, ప్రతీ విభాగంలో పూర్తి శ్రద్ధతో పని చేసారని తెలిపారు. దర్శకుడు శ్రీనివాస్ మన్నె, సంగీత దర్శకుడు ఆర్ ఆర్ ధృవన్, డీవోపీ సంతోష్ కూడా ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా శ్రమించారని, సినిమా విజయం సాధించాలని కోరిక వ్యక్తం చేశారు.
ఈ సినిమా విడుదల క్రిస్మస్ కానుకగా ప్లాన్ చేయడం, ప్రత్యేక ప్రీమియర్లను ఏర్పాటు చేయడం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి చేస్తున్న ప్రమోషన్స్ అన్ని సినిమాకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. మొత్తంగా సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు ఇది మంచి అనుభవంగా ఉండబోతోందని మూవీ టీమ్ తెలుపుతోంది.
Follow Us