/rtv/media/media_files/2025/09/24/jailar-2-update-2025-09-24-17-50-57.jpg)
Jailer 2 Update
Jailer 2 Update: సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ప్రస్తుతం నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’ సినిమాపై అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. 2023లో వచ్చిన జైలర్ సినిమా మంచి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి, రజనీకి మళ్లీ మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే సక్సెస్‌ను కొనసాగించేందుకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సీక్వెల్ తెరకెక్కుతోంది.
Also Read: రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!
రిలీజ్ డేట్‌పై రజనీకాంత్ క్లారిటీ
తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన రజనీకాంత్, “జైలర్ 2ను 2026 జూన్ 12న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. షూటింగ్ చాలా బాగా జరుగుతోంది” అని తెలిపారు. మొత్తం షూటింగ్ పనులు 2024 డిసెంబర్ లేదా 2025 జనవరి లోపు పూర్తవుతాయని, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌కు మంచి సమయం దొరుకుతుందని తెలిపారు.
Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?
స్టార్ క్యాస్టింగ్
ఇప్పటికే ఈ చిత్రంలో మలయాళ లెజెండ్ మోహన్‌లాల్, కన్నడ పవర్ స్టార్ శివరాజ్‌కుమార్ పాత్రలు కొనసాగించనున్నారని సమాచారం. ఇక తమిళ సినిమానే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి పెరిగేందుకు, టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సన్ పిక్చర్స్ & అనిరుధ్ కాంబో మళ్లీ
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ అధినేత కలానిధి మారన్ నిర్మిస్తుండగా, సంగీతాన్ని మళ్లీ అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌లో అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్ & సాంగ్స్ ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే స్థాయి మ్యూజిక్ మళ్లీ జరగొచ్చని అభిమానులు భావిస్తున్నారు.
Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!
మాస్, ఎమోషన్, యాక్షన్..
ఫస్ట్ పార్ట్ చూసిన ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే, జైలర్ 2లో మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా, పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్ మరింత హై లెవెల్‌లో ఉంటాయట. దీంతో ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అవ్వడం ఖాయం అనే బలమైన నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.