Rajasaab First Trailer: వాట్ ఏ విజన్.. వాట్ ఏ థాట్.. ప్రభాస్ 'రాజాసాబ్' ప్లానింగ్ అదుర్స్

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘రాజాసాబ్’ ఫస్ట్ ట్రైలర్ నిడివి 3 నిమిషాల 30 సెకన్ల తో అక్టోబర్ 2న ‘కాంతారా చాప్టర్ 1’ సినిమాతో పాటుగా థియేటర్లలో విడుదల కానుంది. రొమాంటిక్ హారర్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది.

New Update
Rajasaab Teaser

Rajasaab First Trailer

Rajasaab First Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, మారుతి(Director Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్(Rajasaab Update) ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్‌కు(Rajasaab First Trailer) సంబంధించిన రన్ టైం లాక్ అయినట్లు సమాచారం. ట్రైలర్ నిడివి దాదాపు 3 నిమిషాల 30 సెకన్లు ఉండనుందని టాక్ వినిపిస్తోంది.

Also Read: ఇదేం ట్విస్ట్ 'రాజా సాబ్'.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా.. !

అక్టోబర్ 2న ట్రైలర్‌

ఇక ఈ ట్రైలర్‌ను అక్టోబర్ 2న విడుదలవుతున్న ‘కాంతారా చాప్టర్ 1’ సినిమాతో పాటు థియేటర్లలో ప్రదర్శించనున్నారని సమాచారం. అంటే, కాంతారా సినిమా థియేటర్‌కి వెళ్ళిన ప్రేక్షకులకు ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా ట్రైలర్‌ బోనస్ ఉండనుంది. 

Also Read: డార్లింగ్ మామూలోడు కాదుగా.. 'రాజాసాబ్' పార్ట్ 2 కూడా..!

ప్రభాస్ ఈసారి హారర్ ఫాంటసీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ నుంచి చాలా రోజుల తర్వాత ఒక రొమాంటిక్ కంటెంట్ ఉన్న సినిమా వస్తుండటం వల్ల ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ప్రభాస్ "రాజా సాబ్" లో భారీ సర్ ప్రైజ్! ఐటమ్ నెంబర్ కోసం స్టార్ హీరోయిన్ రంగంలోకి

మూవీ టీం ఇప్పటికే షూటింగ్‌ను చాలావరకు పూర్తిచేసి, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుపుతోంది. సంక్రాంతి కానుకగా 2025 మొదట్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే పోస్టర్.. 'రాజాసాబ్' నుంచి అదిరే అప్డేట్!

ఇక ఈ ట్రైలర్‌ విషయంలో ఇప్పటికే మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారికంగా విడుదల తేదీపై ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, అక్టోబర్ 2న థియేటర్లలో ట్రైలర్ రావడం ఖాయంగా అనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్‌లో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందో, సినిమా టోన్ ఏ విధంగా ఉంటుందో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే, ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇది చాలా ఎగ్జయిటింగ్ అప్‌డేట్. ప్రభాస్ మాస్ అండ్ క్లాస్ ఇమేజ్‌కి తగినట్టుగా ఈ ట్రైలర్ ఉండబోతుందని టీమ్ చెబుతోంది. ఒకవైపు కాంతారా సినిమాతో విజువల్ ట్రీట్, మరోవైపు ప్రభాస్ ట్రైలర్‌తో థియేటర్‌లో హంగామా జరగనుంది. 

Advertisment
తాజా కథనాలు