/rtv/media/media_files/2025/08/06/rajasaab-part-2-2025-08-06-11-40-41.jpg)
RajaSaab Part 2
RajaSaab Part 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువ సీక్వెల్స్ తెస్తుంది కూడా మన డార్లింగే.. బాహుబలి తర్వాత ఆయన ఎలాంటి స్క్రిప్ట్ అయినా వైవిధ్యంగా ఉండాలని, భారీ బడ్జెట్‌తో తెరకెక్కాలని నిర్ణయించుకొని తీస్తున్నారు. అదే బాటలో ఇప్పుడు తెరకెక్కుతున్న చిత్రం "ది రాజాసాబ్". మాస్ ఎంటర్టైనర్ సినిమాలకు పేరున్న దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్ ఏర్పడింది.
ఈ మూవీతో ప్రభాస్ తన కెరీర్‌లో మొదటిసారిగా హారర్-కామెడీ జానర్‌లో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, సినిమా టైటిల్‌తోనే ఫ్యాన్స్‌ని అలరిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్‌కి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్ ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు.
ప్రస్తుతం హైదరాబాదులోని ఆర్‌ఎఫ్‌సీలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చివరి దశ చిత్రీకరణ వేగంగా సాగుతోంది. ఈ షెడ్యూలుతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. మారుతి, ప్రభాస్, టెక్నికల్ టీమ్ అందరూ ఈ సినిమాను వినూత్నంగా తెరకెక్కించేందుకు చాలా కష్టపడి పని చేస్తున్నారు .
RajaSaab పార్ట్ 2..?
ఇదిలా ఉండగా, తాజా సమాచారం ప్రకారం "ది రాజాసాబ్"కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు మారుతి. సినిమా కథ ఆధారంగా, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను బట్టి, కథకు కొనసాగింపు అవసరమని దర్శకుడికి అనిపించిందట. ఈ కారణంగా పార్ట్ 2 కూడా స్క్రిప్ట్ దశలో ఉందని తెలుస్తోంది.
ఇది చూసి ఫ్యాన్స్ మరోసారి ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ నటించిన బాహుబలి, సలార్, కల్కి వంటి సినిమాలన్నీ సీక్వెల్ ప్రాజెక్టులు కావడం తెలిసిందే. ఇప్పుడు "ది రాజాసాబ్" కూడా ఆ జాబితాలో చేరబోతుండడంతో, ప్రభాస్ ఒక్కరే టాలీవుడ్‌లో ఎక్కువ సీక్వెల్ సినిమాలు చేసిన హీరోగా మారనున్నాడు.
అయితే, ప్రస్తుతం ప్రభాస్‌కి ఉన్న కమిట్‌మెంట్లు ఎక్కువగా ఉండటంతో, పార్ట్ 2 పట్ల అధికారిక ప్రకటన కొద్దిగ ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. కానీ కథా పరంగా ఇప్పటికే మారుతి సీక్వెల్ ప్లాన్‌ను ఆరంభించారని టాక్ వినిపిస్తోంది.
ఫన్, ఫియర్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్..
ఈ విధంగా, ఫన్, ఫియర్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన "ది రాజాసాబ్" సినిమా ప్రభాస్ కెరీర్‌కి మైలురాయిగా నిలవడమే కాదు, తెలుగు సినీ ప్రేక్షకులకూ కొత్త అనుభూతిని అందించనుంది. డిసెంబర్ 5న థియేటర్లలో రాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.