Raja Saab : ప్రభాస్ 'రాజాసాబ్' లో ఆ హిట్ సాంగ్ రీమిక్స్..!?

ప్రభాస్ 'రాజాసాబ్' మూవీలో ఒకప్పటి బాలీవుడ్ హిట్ సాంగ్ 'హవా హవా.. ఏ హవా కుష్బూ లుటాదే' పాటను రీమిక్స్ చేస్తున్నారట. ఈ పాట రీమిక్స్ హక్కుల కోసమే దాదాపుగా 2 కోట్లు ఖర్చు చేశారని, ఈ సాంగ్ ని ఇప్పుడున్న ట్రెండ్ కి అనుగుణంగా తమన్ ట్యూన్ చేసినట్లు సమాచారం.

raja saab
New Update

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో 'ది రాజా సాబ్' ఒకటి. రొమాంటిక్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకోగా.. ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వదిలిన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. 

Also Read: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

హిందీ సాంగ్ రీమిక్స్..

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒకప్పటి బాలీవుడ్ హిట్ సాంగ్ ను రీమేక్స్ చేయబోతున్నాడట. 'ఇన్సాఫ్ అప్నా లాహో సె' అనే హిందీ సినిమాలోని 'హవా హవా.. ఏ హవా కుష్బూ లుటాదే..' అనే సాంగ్ ని 'రాజాసాబ్' లో రీమిక్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read : ఆ స్టార్‌ హీరో వేధిస్తున్నాడు.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్

రెండు కోట్లు ఖర్చు చేసి మరీ..

ఈ సాంగ్ ని ఇప్పుడున్నా ట్రెండ్ కి అనుగుణంగా తమన్ ట్యూన్ చేస్తున్నాడని, అంతేగాకుండా ఈ పాట రీమిక్స్ హక్కుల కోసమే నిర్మాతలు దాదాపుగా రూ.2 కోట్లు ఖర్చు చేశారని టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ 'హవా, హవా' అనే సాంగ్  ఇప్పటికీ సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వినిపిస్తుంటుంది. 

అందుకే థమన్ లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్లు ఈ సాంగ్ ను ప్రభాస్ సినిమా కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక 'రాజా సాబ్' షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10 న విడుదల కానుంది.

Also Read: ఇదేం ట్విస్ట్ సామీ..'OG' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అకీరా?

Also Read : నేను ఇలాగే మాట్లాడతా, ఎవ్వరూ ఏం పీకలేరు.. వాళ్లపై విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్

#prabhas-rajasaab #sanjay-dutt #maruthi #thaman #the-raja-saab-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe