/rtv/media/media_files/2024/11/19/P6AQ9NUilKxXn8kmGD7L.jpg)
'మాజీ భార్య' అని పిలవద్దు
అయితే తాజాగా రెహ్మాన్ మాజీ భార్య సైరా బాను ఆయన ఆరోగ్యంపై స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. దేవుడు దయవల్ల ఆరోగ్యంగా ఉన్నారు.. కోలుకుంటున్నారని తెలిపారు. అలాగే రెహ్మాన్ విషయంలో తన గురించి చెప్పేటప్పుడు 'మాజీ భార్య' అంటూ సంభోదించవద్దని రిక్వెస్ట్ చేశారు. తాము ఇంకా అధికారికంగా విడిపోలేదని. తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున కొంతకాలంగా రెహ్మాన్ కి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. అంతేకాని, తాము విడాకులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆయన్ని ఇంకా ఎక్కువ ఒత్తిడి చేయాలనుకోవడం లేదు.. దయచేసి 'మాజీ భార్య' అనకండి అని వాయిస్ నోట్ ద్వారా తెలిపారు.
రెహ్మాన్, సైరా భాను 1995లో వివాహం చేసుకున్నారు. పెళ్ళైన 29ఏళ్ళ తర్వాత 2024 నవంబర్ లో సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్లు ప్రకటించారు. దీని తర్వాత రెహ్మాన్ పై రకరకాల విమర్శలు వచ్చాయి. మరో అమ్మాయి కారణంగానే భార్యతో విడాకులు తీసుకున్నారు అంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే అప్పుడు కూడా సైరా భాను భర్త రెహ్మాన్ పై వచ్చిన కథనాలను కొట్టిపారేశారు. రెహ్మాన్ ఎంతో మంచివారంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా మాత్రమే తాను రెహ్మాన్ కి దూరంగా ఉన్నట్లు తెలిపారు.
Also Read: Suma Chaaaat Show: తమన్ చాట్ ఛాలెంజ్.. సుమ కంటెస్ట్ లో విన్ అవ్వడానికి ఇలా చేయండి?