/rtv/media/media_files/2025/03/15/JcE5ItRZqI9PCw4oA2Zw.jpg)
Veera Dheera Soora Teaser
Veera Dheera Soora Teaser: చియాన్ విక్రమ్(Chiyaan Vikram) లేటెస్ట్ మూవీ 'వీర ధీర సూరన్ -2' సంబందించిన టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!
వీర ధీర శూర సినిమా కథ విషయానికి వస్తే రేషన్ డీలర్ అయిన విక్రమ్ ఇంకా పోలీస్ ఆఫీసర్ ఎస్.జె. సూర్య మధ్య జరిగే భీకర యుద్ధం ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా ఆడియన్స్ కు టెన్షన్ పుట్టిస్తూ మంచి త్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుందని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. రిలీజైనా టీజర్ లో సినిమా విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విక్రమ్ యాక్షన్ సీక్వెన్సులు అన్ని అద్భుతంగా కన్పిస్తున్నాయి.
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి
టీజర్ కు సూపర్ రెస్పాన్స్ ..
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది. తెలుగులో 'వీర ధీర సూరన్ -2' సినిమాను ఎన్వీఆర్ సినిమాస్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 2025 మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారైనా విక్రమ్ సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫాంలోకి వస్తాడో లేదో చూడాలి మరి.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
Follow Us