/rtv/media/media_files/2025/09/11/little-hearts-2025-09-11-20-35-19.jpg)
Little Hearts
Little Hearts: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలే పెద్ద విజయం సాధిస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణగా నిలిచింది ‘లిటిల్ హార్ట్స్’ సినిమా. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఆడియన్స్ మనసులు గెలుచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఈ మూవీని చూసిన వారు అందరూ ఒక్కటే అంటున్నారు - ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. యూత్ పెద్ద ఎత్తున కనెక్ట్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మనసును కూడా గెలుచుకుంది.
Watched #LittleHearts yesterday… What a funnn & laughter ride! No melodrama, no gyan… just full entertainment. A very fresh, young love story. A blast by the lead @mouli_talks, a sweet presence by @shivani_nagaram, and candid performances by friends & other artists. Loved the… pic.twitter.com/0ycrtuD4tg
— Allu Arjun (@alluarjun) September 11, 2025
Also Read: ఫస్ట్ టైమ్.. కొడుకు ఫొటో షేర్ చేసిన వరుణ్ తేజ్.. ఎంత క్యూట్ గా ఉన్నాడో! పిక్స్ చూశారా
బన్నీ ఏమన్నారంటే..?
ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’ సినిమాను చూసిన అల్లు అర్జున్, సోషల్ మీడియాలో ప్రత్యేకంగా స్పందించారు. ఆయన తన పోస్టులో ఇలా పేర్కొన్నారు..
"లిటిల్ హార్ట్స్ - నవ్వులతో నిండిన ప్రయాణం. ఇందులో ఎలాంటి మెలోడ్రామా లేదు.. కేవలం వినోదమే. ప్రేమకథలో కొత్తదనం ఉంది. హీరోగా మౌళి యాక్టింగ్ బాగా నచ్చింది. శివాని నాగరం సహా ఇతర నటులు చాలా బాగా నటించారు. దర్శకుడు సాయి మార్తాండ్ టేకింగ్, సింజిత్ యెర్రమల్లి సంగీతం చాలా బాగున్నాయి. ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చిన బన్నీ వాసుకి థాంక్స్." అంటూ స్పందించారు.
అల్లు అర్జున్ ఒక్కరే కాదు, రవితేజ, నాని, నాగచైతన్య, అల్లరి నరేశ్ వంటి పలువురు స్టార్ హీరోలు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read: 'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!
ఓటీటీ ప్లాన్ నుండి థియేటర్ హిట్ వరకు
తొలుత ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నప్పటికీ, కథపై నమ్మకంతో థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న చిత్ర బృందం ఇప్పుడు సక్సెస్‌ను ఆస్వాదిస్తోంది. సినిమా విడుదలైన మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ రావడంతో, వీక్ డేస్‌లో కూడా థియేటర్లలో మంచి ఓక్యుపెన్సీ కనబడుతోంది.
తొలిసారి హీరోగా మెప్పించిన మౌళి
‘#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనూజ్ ఈ చిత్రంలో హీరోగా నటించి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఆయన సరసన శివాని నాగరం, జయకృష్ణ లాంటి నటులు కూడా బాగా నటించారు.
దర్శకుడిగా సాయి మార్తాండ్ కూడా ఇది మొదటి ప్రయత్నమే అయినా, కథను చాలా ఎఫెక్టివ్‌గా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను ఆదిత్య హాసన్ నిర్మించగా, బన్నీ వాసు, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేశారు.
స్మాల్ బడ్జెట్ - బిగ్ హార్ట్
తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 'కంటెంట్ ఈజ్ కింగ్' ఆనే మాటను మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా యువతకు చేరువైన కథనంతో, వినోదం కలిపి తెరకెక్కించిన ఈ సినిమా మంచి స్ఫూర్తిగా నిలుస్తోంది. మొత్తానికి ఓ మంచి కథతో, కొత్త టాలెంట్‌తో రూపొందిన ఈ సినిమా థియేటర్‌లో చూడాల్సిన ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది.