Lawrence : కష్టాల్లో ఉన్న అన్నదాతలకు అండగా నిలుస్తున్న రాఘవ లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు!
రాఘవ లారెన్స్ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గతంలో పేద రైతులకు ట్రాక్టర్లు ఇస్తానన్న హామీని ఆయన నెరవేర్చారు. విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి ట్రాక్టర్ను అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను లారెన్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.