సినిమాల్లోనే కాదు..రియల్ లైఫ్‌లోనూ హీరోయిన్ అనిపించుకున్న అనన్య హీరోయిన్ అనన్య నాగళ్ల మరోసారి తన ఉదార మనస్సును చాటుకుంది. హైదరాబాద్‌లో ఓ బస్టాండ్ దగ్గర నిద్రిస్తున్న కొందరికి స్వయంగా తానే దుప్పట్లు పంపిణీ చేసింది. ఈ వీడియో చూసి నెటిజన్లు సినిమాల్లోనే కాదు..రియల్ లైఫ్‌లోనూ హీరోయిన్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. By Kusuma 13 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల నుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్ స్టార్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. అయితే తెలంగాణకి చెందిన అనన్య ఎప్పుడు పేదలకు సాయం చేస్తూ ముందుంటుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు కూడా తన వంతుగా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించి సేవా గుణాన్ని చాటుకుంది. ఇది కూడా చూడండి: 10th విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇకపై! రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారికి.. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా వరదల సమయంలో తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం ప్రకటించలేదు. ఈమె ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ కూడా అభినందించారు. అయితే అనన్య నాగళ్ల మరోసారి పేదలకు సాయం చేసింది. చాలా మందికి ఇళ్లు లేక రోడ్డు పక్కనే నిద్రపోతుంటారు. వీరికి కనీసం దుప్పట్లు కూడా ఉండవు. అందులోనూ ఇది చలికాలం. దుప్పటి లేకుండా బయట నిద్రపోవాలంటే చాలా కష్టం. A warm gesture by @AnanyaNagalla as she distributes blankets to those in need 😍Truly Heartwarming #Humanity 💫#Ananyanagalla pic.twitter.com/w6aYd2iMHl — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 12, 2024 ఇది కూడా చూడండి: పొలిటికల్ పవర్ లిస్ట్‌లో టాప్-5లో ఉన్న రాజకీయ నాయకులు వీళ్లే! ఇలాంటి వారికి అనన్య దుప్పట్లు ఇస్తూ తన ఉదార మనస్సును చాటుకుంది. హైదరాబాద్‌లో ఓ బస్టాండ్ దగ్గర దుప్పట్లు లేకుండా నిద్రపోయిన వారికి పంపినీ చేసింది. నిద్రపోతున్న వారికి తానే దుప్పట్లు కప్పుతున్న వీడియోను చూసి నెటిజన్లు అనన్యను పొగుడుతున్నారు. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ మీరు హీరోయిన్ అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల అనన్య నాగళ్ల పొట్టేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఈమె యాక్టివ్‌గానే ఉంటుంది. ఇది కూడా చూడండి: AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు! A warm gesture by @AnanyaNagalla as she distributes blankets to those in need 😍Truly Heartwarming #Humanity 💫#Ananyanagalla pic.twitter.com/FebErvifec — Teju PRO (@Teju_PRO) November 12, 2024 ఇది కూడా చూడండి: Pawan Kalyan: పవన్ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ! #Ananya Nagalla Helping #Helping Nature #viral #ananya-nagalla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి