Dhananjaya wedding pics: ఘనంగా 'పుష్ప' విలన్ జాలిరెడ్డి పెళ్లి వేడుకలు!

'పుష్ప' ఫేమ్ నటుడు ధనుంజయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు ధన్యత మెడలో మూడు ముళ్ళు వేశారు. మైసూర్ వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Dhananjaya wedding pics

Dhananjaya wedding pics

Dhananjaya wedding pics:  'పుష్ప' సినిమాలో  జాలిరెడ్డిగా  పాత్రతో ఫుల్ పాపులరైన ధనుంజయ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈరోజు తన ప్రియురాలు ధన్యత మెడలో మూడు ముళ్ళు వేశారు. 15, 16 తేదీల్లో మైసూర్ వేదికగా వీరి పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. 15న రిసెప్షన్ జరగగా.. టాలీవుడ్తా, కోలీవుడ్ సెలెబ్రెటీలు హాజరయ్యారు. 16న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుకలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతేడాది నవంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. మూడు ముళ్ళ బంధంతో ఒకటి అయ్యారు.  

Also Read: Monalisa Photo: హీరోయిన్లకే అసూయ పుట్టే అందం.. మిల మిల మెరిసిపోతున్న మోనాలిసా

ఘనంగా పెళ్లి

ధనుంజయ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ధన్యత ఒక డాక్టర్. ఆమె చిత్రదుర్గ ప్రాంతానికి చెందినదిగా సమాచారం. చాలా కాలంగా పరిచయం ఉన్న వీరిద్దరూ ప్రేమికులుగా మారారు. అదే ప్రేమతో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. 

Also Read: Chhaava Day 2 Collections: రెండు రోజుల్లోనే 100 కోట్ల దిశగా.. 'చావా' బాక్సాఫీస్ సంచలనం


ధనుంజయ్ హీరో కమ్ విలన్‌గా కన్నడలో  పలు సినిమాలు చేశారు. కన్నడ ఆడియన్స్ ఈయనను ముద్దుగా డాలీ అని పిలుచుకుంటారు. పలు  సినిమాల్లో ధనుంజయ్  యాక్టిగ్ చూసి ఫిదా అయిన సుకుమార్  'పుష్ప' లో విలన్ రోల్ కి తీసుకున్నారు. ఇక ధనుంజయ్ పుష్ప అవకాశాన్ని సరిగ్గా యూజ్ చేసుకున్నారు. జాలిరెడ్డి పాత్రలో అదరగొట్టాడు. 

Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు