/rtv/media/media_files/2024/12/29/lOdaaPfnxjwbGBkmP3vj.jpg)
PUSHPA 3 release
Pushpa 3: అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప1, పుష్ప2 బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. రీసెంట్ రిలీజ్ 'పుష్ప 2' ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,871కోట్ల కలెక్షన్లతో ఇంతక ముందున్న 'బాహుబలి' రికార్డులను బ్రేక్ చేసింది. ఇందులో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ మాస్ యాక్షన్, పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇక మూవీ చివరిలో దర్శకుడు సుకుమార్ 'పుష్ప' పార్ట్ 3 కూడా ఉండబోతున్నట్లు హిట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.
#Pushpa3 - THE RAMPAGE 💥
— Movies4u Official (@Movies4u_Officl) March 16, 2025
Releasing in 2028 👌😎💥💥💥#AlluArjun • #Sukumar
pic.twitter.com/aN0Uv4VPXm
పుష్ప 3 రిలీజ్ కన్ఫర్మ్
దీంతో పార్ట్ 3 ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'పుష్ప' నిర్మాత రవి శంకర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఇచ్చారు. ఇటీవలే నితిన్ 'రాబిన్ హుడ్' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన.. 'పుష్ప 3' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. 2028లో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ చేస్తున్నారని.. ఆ సినిమా పూర్తయిన తర్వాత పుష్ప3 స్టార్ట్ అవుతుందని చెప్పారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'పుష్ప2' లో అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించగా.. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, పవని తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యర్నేని, రవి శంకర్ ఈ సినిమాను నిర్మించారు.
Also Read: Manchu Vishnu: అలా అడిగితే ప్రభాస్ చంపేస్తా అన్నాడు.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!