ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప2' దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్ అవుతున్నాయి. టాలీవుడ్ లో ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ ను చెరిపేసి సరికొత్త రికార్డులను బన్నీ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రూ. 294 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డులను సెట్ చేసిన 'పుష్ప2'.. ఇప్పుడు ఏరియా విజ్ గానూ అదే జోరు చూపిస్తోంది.
నైజాం కింగ్ గా బన్నీ..
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప' డామినేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ సినిమా తాజాగా నైజాం ఏరియాలో మొదటి రోజే 30 కోట్ల షేర్ వసూళ్లు సాధించి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు.
Also Read: ఏసీసీ కొత్త అధ్యక్షుడుగా.. శ్రీలంక లెజెండ్
ALL TIME RECORD in Nizam ❤️🔥
— Pushpa (@PushpaMovie) December 6, 2024
WILDFIRE BLOCKBUSTER #Pushpa2TheRule collects a share of 30 CRORES on Day 1 making it the biggest opener in the region 💥💥#RecordRapaRapAA 🔥#Pushpa2BiggestIndianOpener RULING IN CINEMAS
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/Xqt3Mmzw5g
Also Read : డబ్బులు తక్కువిచ్చినా పర్లేదు కానీ ఫ్రీగా ఆ పని చేయను.. రష్మిక షాకింగ్ కామెంట్స్
ఒక్క ఏరియాలో ఈ రేంజ్ కలెక్షన్స్ ఇప్పటివరకు మరే సినిమాకి సాధ్యం కాలేదు. కాగా నిన్నటి వరకు నైజాం డే వన్ కలెక్షన్స్ పరంగా 'RRR' రూ.23.35 ఫస్ట్ ప్లేస్ లో, ప్రభాస్ 'సలార్' రూ.22.55 కోట్లతో రెండో స్థానంలో ఉండగా.. 'పుష్ప2' తో అల్లు అర్జున్.. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లను దాటేశాడు. ఈ రికార్డ్ తో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఆ ఏరియాల్లోనూ హైయెస్ట్ కలెక్షన్స్
'పుష్ప2' తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ భారీగా వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే హిందీలో రూ.72 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం కర్ణాటకలో రూ.23.7 కోట్లు, కేరళలో రూ.6.35 కోట్లు, తమిళనాడు రూ.11 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్టులు సృష్టించింది.
Also Read : సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం