పుష్ప 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో లాఠీ ఛార్జ్.. వీడియో వైరల్!

హైదరాబాద్‌ యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్‌కు అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఈవెంట్‌లో తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. దాన్ని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేసినట్లు సమాచారం.

New Update
pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప2’. ఈ సినిమా డిసెంబర్ 5 అంటే మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ మరింత వేగవంతం చేశారు. మొదట నార్త్ నుంచి పుష్ప మేనియా స్టార్ట్ చేశారు. 

Also Read: 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!

మొదట పట్నాలో ప్రమోషన్స్ షురూ చేసిన మూవీ టీం.. ఆ తర్వాత ముంబై, తమిళనాడు, కర్ణాటక, చెన్నై వంటి రాష్ట్రాలను చుట్టుముట్టారు. ఇక పుష్ప రాజ్‌ను చూసేందుకు ప్రేక్షకాభిమానులు తరలివచ్చారు. ఇలా పలు రాష్ట్రాల్లో ఈవెంట్లు నిర్వహించి ఫుల్ బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. 

ఈవెంట్‌లో లాఠీ ఛార్జ్

Also Read:  దేశంలో నల్లధనం పెరుగుతోంది.. అంబానీ, అదానీకే అడ్డగోలు మాఫీలు!

ఇవాళ పుష్ప - 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు, సినీ ప్రేక్షకులు హాజరయ్యారు. గ్రౌండ్‌లో జనాలు కిక్కిరిసిపోయారు. కనీసం కాలు తీసి కాలు వేద్దామంటూ ప్లేస్ లేకుండా ఉంది. అంతలా జనం వచ్చారు. దీంతో ఈవెంట్‌లో తోపులాట జరిగింది. దీని కారణంగా పోలీసుల లాఠీ ఛార్జ్‌ చేసినట్లు తెలుస్తోంది. తోపులాటను అదుపుచేసేందుకు పోలీసుల లాఠీ ఛార్జ్‌ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

గెస్ట్‌గా మెగాస్టార్?

ఇదిలా ఉంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారని తాజా సమాచారం బయటికొచ్చింది. ఇటీవల ఏపీ ఎలక్షన్స్ టైం లో బన్నీ.. పవన్ కు సపోర్ట్ చేయకపోవడం, ఈ మధ్య నాగబాబు, వరుణ్ తేజ్.. బన్నీ పై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేయడం లాంటి సంఘటనలు మెగా - అల్లు కుటుంబాల మధ్య వైరాన్ని మరింత పెంచాయి. 

Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్

దీంతో ఫ్యాన్స్ కూడా రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో అటాక్ చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో 'పుష్ప2' ప్రీ రిలీజ్ కి చిరు గెస్ట్ గా రాబోతున్నారనే వార్త సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారింది. తమ కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అందరికి తెలియాలనే మెగాస్టార్.. ఈ ఈవెంట్ కి రాబోతున్నారని మెగా సన్నిహిత వర్గాల సమాచారం. 

నాగబాబు ట్వీట్ వైరల్..

Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం

మరోవైపు తాజాగా  నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ''నువ్వు త‌ప్పుడు దారిలో వెళ్తున్నావ‌ని నువ్వే గుర్తిస్తే వెంట‌నే నీ దారిని మార్చుకో. నువ్వు ఆల‌స్యం చేసే కొద్దీ, నువ్వు నిజంగా ఎక్క‌డి వాడివో అక్క‌డికి వెళ్ల‌డం మ‌రింత క‌ష్టంగా మారుతుంది" అంటూ స్వామివివేకానంద కొటేషన్ పెట్టారు.

Advertisment