దేశంలో నల్లధనం పెరుగుతోంది.. అంబానీ, అదానీకే అడ్డగోలు మాఫీలు! బీజేపీ పాలనలో దేశంలో నల్లధనం భారీగా పెరిగిపోయిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేస్తుంటే బీజేపీ మాత్రం అంబానీ, అదానీల మాఫీలు చేస్తుందని మండిపడ్డారు. ఇక్కడ ఉనికిని కాపాడుకునేందుకు తమపై చార్జ్ షీట్ విడుదల చేసిందన్నారు. By srinivas 02 Dec 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి TG News: రాష్ట్రంలో బీజేపీ ఉనికిని కాపాడుకోవడానికే తమ ప్రభుత్వంపై చార్జ్ షీట్ విడుదల చేసిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. వడ్లకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన కేంద్రం ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించలేని బీజేపీ రైతుల గురుంచి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సోమవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి.. దేశంలో ఎక్కడ లేనివిధంగా సన్న వడ్లకి తాము రూ. 500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. అంబానీ, అదానీలకు వేల కోట్లు మాఫీ.. రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉచిత కరెంట్ రాయితీ పొందుతున్నారు. 110 కోట్ల ఉచిత బస్ టికెట్లు ఇచ్చాం. ఏడాదికి 20వేల కోట్ల రూపాయలు వరకు సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రుణమాపి చేస్తున్నారా? యూపీ ప్రభుత్వం హయాంలో సోనియాగాంధీ జాతీయ స్థాయిలో రుణమాపి చేసింది. జాతీయ స్థాయిలో రుణమాఫీ చేసి ఉంటే రాష్ట్రానికి 20 వెల కోట్లు అదా అయ్యేవి. ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలని కూడా అమలు చేస్తాం. బీజేపీ నల్లధనం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు వేస్తాం అన్నారు. కానీ దేశంలో ఇంకా నల్లధనం పెరిగిపోయింది. మేము రైతుల రుణమాఫీ గురుంచి మాట్లాడుతుంటే.. బీజేపీ అంబానీ, అదానీ గురించి ఆలోచిస్తుందని, వాళ్ళకు మాత్రమే వేల కోట్లు మాఫీ చేస్తుందన్నారు. ఇది కూడా చదవండి: అర్థంతారంగా రాలిన తార.. సిల్క్ స్మిత బయోపిక్ గ్లింప్స్ దేశానికి అన్నం పెట్టేది రైతు బీజేపీ పాలనలో నష్టాల్లో కూరుకుపోతున్నాడు. పెట్రోలియం, డీజిల్ 70 ఉంటే ఇప్పుడు 100 పైనే ఉంది. నిత్యావసర ధరలు ఆకాశాని అంటుతున్నాయి. 10 ఏళ్లు బీజేపీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. మేము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీ రాష్ట్రాల్లో అమలు చేయాలంటూ జీవన్ రెడ్డి బీజేపికి సవాల్ చేశారు. ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలన్న దీదీ #jeevan-reddy #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి