‘పుష్ప2’ ఆల్ టైం రికార్డ్.. మూడు రోజుల్లో రూ.621 కోట్ల కలెక్షన్స్!

అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో రూ.621 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. దీంతో అతి తక్కువ రోజుల్లోనే ఫాస్టెస్ట్‌ కలెక్షన్స్ నమోదు చేసి ఆల్ రికార్డు క్రియేట్ చేసింది.

New Update
pushpa 2 (2).

ప్రపంచ వ్యాప్తంగా పుష్పగాడి రూల్ నడుస్తోంది. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. కాదో.. వైల్డ్ ఫైర్ అన్నట్లుగానే సినిమా కలెక్షన్స్ దుమ్ము రేపుతున్నాయి. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు భారీ రెస్పాన్స్‌తో అదరగొడుతోంది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా అబ్బురపరచే కలెక్షన్లు నమోదు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 3 రోజుల్లోనే రూ.621 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అవాక్కయ్యేలా చేసింది. దీంతో అతి తక్కువ రోజుల్లోనే ఫాస్టెస్ట్‌ కలెక్షన్స్ నమోదు చేసి ఆల్ రికార్డు క్రియేట్ చేసింది.

Also Read : 'పుష్ప2' గంగమ్మ తల్లీ జాతర సీన్.. థియేటర్ లో పూనకాలతో ఊగిపోయిన మహిళ

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అందరి అంచనాలను అందుకుని బ్లాక్ బస్టర్ విజయాన్ని కైవసం చేసుకుంది. తొలి రోజే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇది వరకు ఉన్న రికార్డులను సైతం బద్దలు కొట్టింది. అదే సమయంలో కొత్త రికార్డులను సైతం నమోదు చేసింది. 

Also Read : తగ్గనున్న 'పుష్ప2' టికెట్ రేట్లు.. ఎప్పటి నుంచంటే?

అనంతరం పుష్ప2 రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 449 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేసినట్లు మూవీ మేకర్స్ తెలిపారు. అత్యంత వేగంగా రూ.500 కోట్ల మార్క్ ను చేరుకున్న భారతీయ చిత్రంగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ షేర్ చేశారు. ఇక ఇప్పుడు మూడు రోజుల్లో పుష్ప 2 రూ.621 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Also Read: ఢిల్లీలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్.. తర్వాత పూల వర్షం

నార్త్‌లో మూడు రోజుల కలెక్షన్స్

ఇదిలా ఉంటే ఈ చిత్రం నార్త్‌లో దుమ్ము దులిపేస్తోంది. హిందీ ఆడియన్స్ 'పుష్ప2' కి బ్రహ్మరథం పడుతున్నారు. డిసెంబర్ 05 న రిలీజైన ఈ సినిమా మొద‌టి రోజు హిందీలో రూ.72 కోట్ల క‌లెక్షన్లు రాబ‌ట్టగా.. తాజాగా మూడో రోజు ఏకంగా రూ.74 కోట్ల వ‌సూళ్లను కలెక్ట్ చేసింది. డే వన్ తో పోల్చుకుంటే మూడో రోజు కలెక్షన్స్ మరింత పెరగడం విశేషం. దీంతో హిందీలో మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.205 కోట్లు రాబ‌ట్టిన తొలి తెలుగు చిత్రంగా 'పుష్ప2' నిలిచింది.

ఇది కూడా చదవండి : మహిళను చంపిన మావోయిస్టులు 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు