/rtv/media/media_files/2025/09/11/raja-saab-first-single-2025-09-11-15-34-22.jpg)
Raja Saab First Single
Raja Saab First Single: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే అతని చేతిలో మూడు సినిమాలు ఉండగా, వాటిలో ఒకటి ‘ది రాజాసాబ్’. ఈ సినిమా పట్ల ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి మారుతీ దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లలో ప్రభాస్ లుక్ చూసిన ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు. వింటేజ్ డార్లింగ్ స్టైల్లో ప్రభాస్ ని చూడటం అభిమానులకు ఓ స్పెషల్ ట్రీట్‌గా మారింది. అప్పట్లో సెన్సషనల్ హిట్ గా నిలిచినా బుజ్జిగాడు మూవీ లో ప్రభాస్ ని చూసినట్లుగా ఉందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా హారర్, ఫాంటసీ, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌గా ఉండబోతుందని సమాచారం.
Also Read: ఓటీటీలోకి 'కూలీ' ఎంట్రీ.. తలైవా వైబ్ అస్సలు మిస్సవకండి!
ముగ్గురు హీరోయిన్‌లతో ఐటెం సాంగ్..?
ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అలాగే, ఓ ఫుల్ మాస్ ఐటెం సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్‌ను తీసుకున్నట్టు టాక్. ఈ సినిమా మరో హైలైట్ ఏమిటంటే, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒక హారర్ కామెడీ సినిమాలో ఇలాంటి స్టార్ కాస్ట్ ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
Also Read: 'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన VFX పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో, డిసెంబర్ విడుదల వాయిదా పడింది. ఇప్పుడు సంక్రాంతి 2025 విడుదలకు రెడీ అవుతోంది. అయితే రిలీజ్ పోస్ట్‌పోన్ అయినా, సినిమా మీద ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. నిర్మాత SKN సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అప్‌డేట్స్(SKN Raja Saab Update) ఇస్తూ హైప్‌ను పెంచుతున్నాడు.
#TheRajaSaab first single
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) September 10, 2025
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/7sndrGIr3F
అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్‌గా ఫస్ట్ సింగిల్..
తాజాగా నిర్మాతలు మొదటి పాటపై అప్‌డేట్ ఇచ్చారు. SKN ఒక గిఫ్ షేర్ చేస్తూ "ది రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ వస్తోంది" అనే హింట్ ఇచ్చారు. ఈ సాంగ్ మాస్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. ఇక నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఈ ఫస్ట్ సింగిల్‌ను ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న విడుదల చేస్తామని కన్ఫర్మ్ చేశారు.
అలాగే, కాంతారా 1 సినిమాతో కలిపి "ది రాజాసాబ్" తొలి ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. అంటే అక్టోబర్‌లో ప్రభాస్ ఫ్యాన్స్‌కి డబుల్ ఫెస్టివల్ ఖాయం!
ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే థమన్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌లో ఆకట్టుకుంది. ఇక ఫస్ట్ సింగిల్‌తో మాస్ ఆడియన్స్‌ను ఫుల్‌గా ఎంటర్టైన్ చేయనున్నారు.
సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న ఈ హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ పైన అటు ఇండస్ట్రీలో, ఇటు ఫ్యాన్స్ లోను ఫుల్ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది. అక్టోబర్ నుంచే ప్రమోషనల్ హంగామా మొదలవుతుందని తెలుస్తోంది. మరి ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడా? చూడాలి!