/rtv/media/media_files/2024/10/30/gx4ggteKbDIU59bJBJND.jpg)
బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'NBK 109'. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన పోస్టర్, ప్రమోషనల్ కంటెంట్ మూవీ అంచనాలను పెంచుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : కొండగట్టులో అఘోరీ.. రేపే ఆత్మార్పణ !
మొన్నామధ్య నిర్మాత నాగవంశీ ఈ సినిమా టైటిల్ ను దీపావళికి అనౌన్స్ చేస్తామని చెప్పడంతో ఫ్యాన్స్ ఎంతో ఆశగా వెయిట్ చేస్తున్న తరుణంలో దీనిపై నిర్మాత ఫ్యాన్స్ కు షాకిచ్చాడు. 'లక్కీ భాస్కర్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా 'NBK109' టైటిల్ అనౌన్స్ మెంట్ పై క్లారిటీ ఇస్తూ బాలయ్య ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పారు.
Apologies to the fans. CG is not yet finished. It may take 10 more days. Title teaser will be out in the second week of November.
— Gulte (@GulteOfficial) October 30, 2024
- #NagaVamsi on #NBK109 Update. pic.twitter.com/KdmIKzQhP9
Also Read : నందమూరి ఫ్యామిలీ నుంచి మరో ఎన్టీఆర్.. ఆల్ ది బెస్ట్ చెప్పిన తారక్
ఇంకాస్త టైమ్ పడుతుంది..
' నిజానికి బాలయ్య NBK 109 సినిమా టైటిల్‌ను పండగకు విజువల్స్‌తో అనౌన్స్ చేద్దామని అనుకున్నాము. కానీ మాకు సీజీ సమయానికి పూర్తవ్వలేదు. అందుకే ఇంకాస్త టైమ్ పడుతుంది. అభిమానులకు సారీ. టైటిల్‌కు విజువల్, బ్యాంగ్‌తో ఇస్తేనే బాగా హైప్ వస్తుందని బాబీ ఇంకా ప్రేత్యేకంగా చేస్తున్నారు. కానీ సీజే వర్క్ టైమ్ వల్ల లేట్ అవుతుంది.
Also Read : జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు!
నవంబర్ రెండో వారంలో అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వారం లేదా పది రోజులు సీజీ కోసం టైమ్ కావాలి..' అని చెప్పారు. ఆయన కామెంట్స్ తో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. మరోవైపు 'NBK109' టైటిల్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. కథకు సూట్ అయ్యేలా ఈ సినిమాకు 'సర్కార్ సీతారాం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని ఇన్సైడ్ వర్గాల సమాచారం.
Also Read : చైతూ - శోభిత పెళ్లి తేదీ ఖరారు.. ఎప్పుడు, ఎక్కడంటే?