/rtv/media/media_files/2024/10/30/oIyQjkkgtbruAxRR3ENQ.jpg)
హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా స్నేహితులుగా ఉన్న వీరు ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా వీరి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలను శోభితా ధూళిపాళ్ల సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. అప్పటినుంచి వీరి పెళ్లి ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Also Read : ఓటీటీలో సుహాస్ లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే?
డిసెంబర్‌లో పెళ్లి..
ఈ క్రమంలో వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్‌లో చైతూ - శోభిత వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారట. డిసెంబర్ 4వ తేదీన వీరు గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 2వ తేదీన సంగీత్, మూడో తేదీన మెహందీ, నాలుగో తేదీన పెళ్లి జరగనున్నట్లు తెలిసింది. డిసెంబర్ 10న గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్లు టాక్.
Also Read : నాగ చైతన్యకు ఊహించని షాకిచ్చిన సమంత.. లీగల్ నోటీసులు!
#NagaChaitanya- #SobhitaDhulipala created buzz on social media after they had dropped their engagement photos. Rumours are rife that the wedding date has been set for December 4. pic.twitter.com/vmVqZ2UPhi
— PeepingMoon (@PeepingMoon) October 30, 2024
Also Read : 'కంగువా' మూవీ టీమ్ కు బిగ్ షాక్.. అతని ఆకస్మిక మరణంతో?
రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డ్స్ 2024 వేడుకలో ఈ విషయం బయటకు వచ్చినట్లు సమాచారం. పెళ్లి తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ పెళ్లిని అక్కినేని ఫ్యామిలీ చాలా సింపుల్ గా ప్లాన్ చేశారట.
ఎలాంటి ఆర్భాటాల్లేకుండా అతికొద్ది మంది బంధువులు, సన్నిహితులను మాత్రమే ఈ పెళ్ళికి పిలవనున్నట్లు అక్కినేని కాంపౌండ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పెళ్లి హైదరాబాద్ లోనే ఉంటుందా? లేదా డిస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read : మెగాస్టార్ మూవీలో మీనాక్షి చౌదరి.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్