/rtv/media/media_files/2025/09/30/mahakali-project-2025-09-30-13-19-47.jpg)
MAHAKALI PROJECT
ప్రశాంత్ వర్మ(prashanth-varma) సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రేక్షకులను అలరించేందుకు క్రేజీ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి విడుదలైన మొదటి సినిమా 'హనుమాన్'(Hanuman) బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండవ ప్రాజెక్ట్ గా హనుమాన్ 2, మూడవ ప్రాజెక్ట్ గా 'మహాకాళి', నాల్గవ ప్రాజెక్టుగా 'అధీర' సినిమాలు అనౌన్స్ చేశారు.
'అసురగురు శుక్రాచార్యుడు'
తాజాగా 'మహాకాళి'(Mahakali Movie) నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. 'అసురగురు శుక్రాచార్యుడు' పాత్రలో అక్షయ్ కన్నా కనిపించబోతున్నట్లు ప్రకటించారు. శుక్రాచార్యుడి గెటప్ లో అక్షయ్ కన్నా లుక్ చాలా పవర్ ఫుల్ గా కనిపించింది.
In the shadows of gods,
— Prasanth Varma (@PrasanthVarma) September 30, 2025
rose the brightest flame of rebellion 🔥
Presenting The Enigmatic #AkshayeKhanna as the eternal 'Asuraguru SHUKRACHARYA' from #Mahakali 🔱❤️🔥@PujaKolluru@RKDStudios#RKDuggal#RiwazRameshDuggal@ThePVCUpic.twitter.com/mclj39Q8z9
PVCU నుంచి వస్తున్న మొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా 'మహాకాళి' రూపొందుతోంది. మహాకాళి శక్తి స్వరూపం, పురాణ అంశాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ స్క్రీన్ ప్లే, కథ అందిస్తుండగా.. పూజా అపర్ణా కొల్లూరు దర్శకత్వం బాధ్యతలు వహిస్తున్నారు. ప్రస్తుతం మహాకాళి పాత్ర కోసం ఫీమేల్ లీడ్ ని వెతికే పనిలో ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అందం ప్రధానం కాకుండా 'మహాకాళి' పాత్ర కోసం రూపం, అభినయం ఉన్న నటిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.
హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత PVCU నుంచి రాబోతున్న PVCU నుంచి రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. IMAX 3D ఫార్మాట్ లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రివాజ్ రమేష్ దుగ్గల్ దీనిని నిర్మిస్తున్నారు. స్మరన్ సాయి సంగీతం అందిస్తున్నారు.
ప్రశాంత్ వర్మ PVCU యూనివర్స్ లో మొత్తం 29 స్క్రిప్ట్స్ సిద్ధమవుతున్నాయి. వాటిలో మొదటి ఆరు సూపర్ హీరో చిత్రాలుగా రాబోతున్నాయని ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇందులో భాగంగానే మహాకాళి, అధీర ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. ఇటీవలే 'అధీర' నుంచి కూడా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో ఎస్. జే సూర్య, కళ్యాణ్ దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్ దాసరి సూపర్ హీరోగా కనిపిస్తుండగా.. ఎస్. జే సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రానికి శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే సినిమాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
Also Read: Bigg Boss Telugu Promo: గేమ్ ఛేంజర్ పవన్.. సుమన్ శెట్టి VS రీతూ నామినేషన్స్ లో రచ్చ రంబోలా!