/rtv/media/media_files/2025/09/18/og-prakash-raj-2025-09-18-11-27-48.jpg)
OG Prakash Raj
OG Prakash Raj: భారీ అంచనాల మధ్య రిలీజ్ కు సిద్ధమవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) "ఓజీ" (They Call Him OG) సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 25, 2025న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా మేకర్స్ వరుసగా క్యారెక్టర్ పోస్టర్స్‌ను విడుదల చేస్తూ సినిమాపై హైప్‌ను పెంచుతున్నారు. నిన్న అర్జున్ దాస్ లుక్ రిలీజ్ కాగా, ఈరోజు ప్రకాష్ రాజ్ లుక్ (సత్య దాదా)ను విడుదల చేశారు. వచ్చే రోజుల్లో మరిన్ని పాత్రల లుక్స్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Here’s the versatile force Prakash Raj in #OG 🔥
— Madhu_Queen♥️💃 (@Madhu_Urmila) September 18, 2025
All set for the grand release on Sep 25th, 2025 🌋 #TheyCallHimOG@prakashraajpic.twitter.com/OcIp07Ogcj
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. మాస్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులకు పక్కా థియేట్రికల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ స్క్రీన్ ఎంట్రీ, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీపై అభిమానులు ఫిదా అయిపోయారు.
సెన్సార్ పూర్తి – U/A సర్టిఫికేట్
సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. దీంతో విడుదలకు ఎలాంటి ఆటంకం లేకుండా సిద్ధమవుతోంది. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌తో మిక్స్ అయిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇదే ఆయన తొలి తెలుగు సినిమా కావడం విశేషం. అలాగే అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, షామ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!
DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, టాప్ టెక్నికల్ టీమ్‌తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయ్యాయి.
Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. 'ఫౌజీ' లో మరో స్టార్ హీరో ఎంట్రీ!
OG Trailer
సినిమా రిలీజ్‌కు వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, అభిమానులు ఇప్పుడు OG ట్రైలర్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ట్రైలర్‌కు సంబంధించిన అధికారిక అప్డేట్ రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లతో హైప్ ఉన్న OG ట్రైలర్ తో మరింత హంగామా చేసే అవకాశముంది.
మొత్తానికి, పవన్ కళ్యాణ్ కొత్త గ్యాంగ్‌స్టర్ అవతారంలో కనిపించబోతున్న OG సినిమా అభిమానులు మాత్రమే కాకుండా మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. OG ట్రైలర్ తో సినిమాకు బూస్ట్ రానుంది.