Pradeep Ranganathan: టంగ్ స్లిప్ అయ్యి ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ చెప్పేసాడు..!

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా టైటిల్ “ఫౌజీ” అని నటుడు ప్రతీప్ రంగనాథన్ పొరపాటున లీక్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

New Update
Pradeep Ranganathan

Pradeep Ranganathan

Pradeep Ranganathan: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం "సీతా రామం" ఫేమ్ హను రాఘవపూడితో కలిసి ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ-ఇండిపెండెన్స్ కాలం నేపథ్యంలో సాగుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఇందులో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి "ఫౌజీ" అనే టైటిల్ పెట్టారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే అధికారికంగా ఈ పేరు ప్రకటించలేదు.

Also Read: రజనీకాంత్ "కూలీ" టీవీ ప్రీమియర్‌కు రెడీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..?

అయితే తాజాగా నటుడు-దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ తన రాబోతున్న సినిమా "డూడ్" ప్రమోషన్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఈ టైటిల్‌ను అన్ ఇన్టెన్షనల్‌గా బయటపెట్టారు. 

Also Read: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!

ప్రభాస్ సర్ సినిమా 'ఫౌజీ'.. (Prabhas Fauji Movie)

ఆయన మాట్లాడుతూ.. “నాకు తెలియదు ఇది చెప్పొచ్చో లేదో కానీ, మా నిర్మాతలు నాకు ప్రభాస్ సర్ సినిమా 'ఫౌజీ' కొన్ని క్లిప్పింగ్‌లు చూపించారు. నేను చూసింది అద్భుతంగా ఉంది. నవీన్ సర్, రవి సర్ లాంటి నిర్మాతలు చాలా ప్యాషనేట్. మీరే ఈ సినిమా చూడబోతున్నారు. టైటిల్ చెప్పేసానా? (నవ్వుతూ)” అని అన్నారు.

Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్..!

ప్రదీప్ రంగనాథన్ చెప్పిన ఈ మాటలతో “ఫౌజీ” అనే టైటిల్ ఫిక్స్ అయిందా? అన్నది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ వ్యాఖ్యలతో ఈ వార్తకు బలం చేకూరింది.

ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతుంది. పీరియాడిక్ యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు, దేశభక్తి అంశాలు ఉండనున్నాయని సమాచారం. ప్రభాస్ ఈ సినిమాతో తన నటనలో మరో కొత్త కోణాన్ని చూపించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

Also Read: మాధురికి దువ్వాడ ఎలా పరిచయం.. అక్కడే ఇద్దరి మధ్య లేటు వయసులో ఘాటు ప్రేమ!

"ఫౌజీ" అనే టైటిల్ ఇప్పుడు అభిమానుల్లో హైప్‌ ఎక్కిస్తోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే కానీ, ప్రదీప్ రంగనాథన్ చెప్పినదే నిజమైతే ప్రభాస్ అభిమానులకు ఇది పెద్ద గుడ్ న్యూస్‌ అనే చెప్పాలి!

Advertisment
తాజా కథనాలు