సంధ్య థియేటర్ ఘటనలో టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నేటి ఉదయమే బన్నీ మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యాడు. ఇక జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అంతా తరలివస్తున్నారు. ఈక్రమంలోనే పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అల్లు అర్జున్ నివాసానికి రానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. Also Read : గ్లామర్ డోస్ పెంచేసిన బాలయ్య బ్యూటీ.. బ్లూ కలర్ ఫ్రాక్ లో అందాల రచ్చ సాయంత్రం 4 గంటలకు డార్లింగ్ వస్తారని తెలిపాయి. కాగా ఇప్పటికే చిరంజీవి సతీమణి సురేఖ, రానా దగ్గుబాటి, నాగ చైతన్య, కె. రాఘవేంద్రరావు, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ సోదరులు, ఆర్. నారాయణమూర్తి, దర్శకుడు సుకుమార్, హరీష్ శంకర్, బివిఎస్ రవి, సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ, పుష్ప నిర్మాతలు నవీన్, రవిశంకర్, కొరటాల శివ, దిల్ రాజు, వంశీ పైడిపల్లి తదితరరులు బన్నీ నివాసానికి వచ్చారు. Also Read : పెళ్లయిన 12 ఏళ్లకు.. బిడ్డకు జన్మనిచ్చిన బాలయ్య హీరోయిన్ అల్లు అర్జున్ అరెస్ట్ పై సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. నాని, రష్మిక , బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ వంటి వారంతా బన్నీ అరెస్ట్‌ను ఖండిస్తూ ట్వీట్స్ చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. బయటకు వచ్చిన తర్వాత బన్నీ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. '' ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నా. అన్ని విధాలుగా అండగా ఉంటా. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు. ప్రమాదవశాత్తూ జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు. కుటుంబంతో కలిసి నేను థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు ఇది చోటుచేసుకుంది. సుమారు 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్‌కు నేను వెళ్తున్నా. దాదాపు 30 సార్లు అక్కడ సినిమా చూశా. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. త్వరలోనే ఆమె కుటుంబాన్ని కలుస్తా.." అని చెప్పాడు. Also Read: బన్నీని చూడగానే వెక్కి వెక్కి ఏడ్చిన భార్య, పిల్లలు! Also Read : అల్లు అర్జున్ కపుల్‌ని చూసి ఏడ్చిన సమంత..! ఇన్‌స్టా పోస్ట్ వైరల్