/rtv/media/media_files/2025/10/08/raja-saab-songs-2025-10-08-15-40-34.jpg)
Raja Saab Songs
Raja Saab Songs: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, మారుతి(Director Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయిన ఈ సినిమాకు సంబంధించిన ఇంకా మిగిలిన రెండు పాటల చిత్రీకరణను గ్రీస్‌లో ప్రారంభించారు.
Rebel Star is painting Greece in his colors of glory 💥💥
— The RajaSaab (@rajasaabmovie) October 8, 2025
Team #TheRajaSaab kickstarts a new schedule with 2 chartbuster songs being crafted to Shake the nation ❤️🔥❤️🔥#TheRajaSaabOnJan9th#Prabhas@directormaruthi@musicthamanpic.twitter.com/kuVHvUUJ6A
ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ People Media Factory సోషల్ మీడియాలో తెలియజేస్తూ, "రెబల్ స్టార్ ప్రభాస్, గ్రీస్ దేశాన్ని తన రంగులతో నింపేసాడు. రెండు చార్ట్‌బస్టర్ పాటలతో కొత్త షెడ్యూల్ మొదలైంది" అంటూ పోస్టు చేసింది. ప్రభాస్ వేసుకున్న కలర్‌ఫుల్ షూస్ ఫోటోను కూడా షేర్ చేశారు.
Also Read: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!
ఈ అప్‌డేట్‌ను దర్శకుడు మారుతి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడం విశేషం. జాన్ 9న రిలీజ్ అవుతున్న రాజాసాబ్ హారర్‌తో పాటు, కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.
మొదట ‘ది రాజా సాబ్’ డిసెంబర్ 5, 2024న విడుదల కావాల్సి ఉంది, కానీ ఇప్పుడు ఇది 2025 జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి భారీ స్పందన లభించింది. హారర్ థ్రిల్లర్‌గా ఉన్నప్పటికీ ఇందులో కామెడీ, యాక్షన్, రొమాన్స్ అన్నీ సమపాళ్లలో ఉండబోతున్నాయి.
Also Read: పవన్ సినిమాలో విలన్‌గా మల్లా రెడ్డి.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రైలర్ హైలైట్స్..
ప్రభాస్ హిప్నటిజం ద్వారా తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. చీకటిలో కనిపించే ఓ అసాధారణ శక్తి... అందుకు రియాక్షన్‌గా ప్రభాస్ సడన్‌గా లేచే సీన్. ఓ దెయ్యాన్ని చూసినప్పుడు ప్రభాస్ దానిని తన తాత అంటూ పరిచయం చేయడం వంటి సీన్స్ కామెడీ గా ఉన్నాయి. సంజయ్ దత్ పాత్రను కూడా ట్రైలర్‌లో పరిచయం చేశారు. అతను సాధారణ మాంత్రికుడు కాదు, ఎక్స్‌ఛార్సిస్ట్, హిప్నోటిస్ట్, సైకియాట్రిస్ట్ అని చెప్పడం కొత్తగా ఉంది. చివర్లో ఒక డిఫరెంట్ గెటప్‌లో ప్రభాస్ "పుట్టలో వేలు పెడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా..? రాక్షసుడిని" అంటూ స్టైలిష్ డైలాగ్‌తో చూపించిన సీన్ హైలైట్ గా ఉంది.
Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..
క్యాస్ట్ అండ్ క్రూ
ఈ సినిమాలో మలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ ముగ్గురు కథానాయికలు సినిమాలో గ్లామర్, గ్రేస్, ఫ్రెష్‌నెస్‌ను తీసుకువస్తారని టీమ్ చెబుతోంది. సినిమాటోగ్రఫీకి కార్తిక్ పలని, సంగీతానికి థమన్ ఎస్ పనిచేస్తున్నారు. సినిమా నిర్మాణ బాధ్యతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుంది.
Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!
ప్రభాస్ మొదటి పూర్తి హారర్ సినిమా..
‘ది రాజా సాబ్’ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మొదటి పూర్తి స్థాయి హారర్ ఎంటర్‌టైనర్. ఇప్పటి వరకు విన్నా, చూసినా ప్రాజెక్టుల కంటే ఇది పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా హారర్‌తో పాటు ఫన్, ఎమోషన్, యాక్షన్ కలగలిపిన బ్లాక్‌బస్టర్‌గా నిలవబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.