/rtv/media/media_files/2025/09/30/prabhas-raja-saab-2025-09-30-17-51-45.jpg)
Prabhas Raja Saab
Prabhas Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న 'రాజా సాబ్' అనే రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ఇప్పుడు ఫుల్ హైప్ లో ఉంది. మారుతి(Director Maruthi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల కాగా, ప్రభాస్ ఫ్యాన్స్ ను, సినీ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో ప్రభాస్ యోగి, బుజ్జిగాడు తరహా వింటేజ్ డార్లింగ్ లుక్‌తో అలరించారు.
రాజాసాబ్ ట్రైలర్ అరాచకం.. (Raja Saab Trailer)
ట్రైలర్‌లో హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్నీ సమపాళ్లలో మిక్స్ కావడంతో, ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. గత కొన్ని సంవత్సరాలుగా పవర్‌పుల్ యాక్షన్ సినిమాల్లో కనిపించిన ప్రభాస్, ఇప్పుడు మళ్లీ తన కామెడీ టైమింగ్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యారు. ట్రైలర్ దాదాపు 3 నిమిషాల 30 సెకన్లు ఉండటం విశేషం. ఇది ఆయన సినిమా ట్రైలర్లలో అత్యధిక నిడివి గల ట్రైలర్.
ఇక సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏమిటంటే, రాజా సాబ్ సినిమా జనవరి 9, 2026 న విడుదల కానుంది. అదే రోజు తమిళ స్టార్ విజయ్ చివరి సినిమా "జన నాయకన్" కూడా విడుదల కానుంది. అయితే, క్లోజ్ కాంపిటిషన్ ఏర్పడకుండా ఉండేందుకు రాజా సాబ్ నిర్మాతలు స్మార్ట్ డెసిషన్ తీసుకున్నారు. తమిళ డబ్బింగ్ వెర్షన్‌ను జనవరి 10న రిలీజ్ చేయనున్నారు.
Also Read: ‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ.జి. విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని ఎస్.ఎస్. తమన్ అందిస్తున్నారు.
మొత్తం మీద, ప్రభాస్ ఈసారి భారీ యాక్షన్ చిత్రాల నుంచి కొంచెం పక్కకు తప్పుకుని, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ హారర్ కామెడీ జానర్‌లో మెరిసే ప్రయత్నం చేస్తున్నారు. సలార్, కల్కి 2898 AD వంటి చిత్రాల మధ్యలో ఒక ఫన్ ఫుల్ ఎంటర్టైనర్ తో మనముందుకు వస్తున్నారు.
ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ఇంకా మూడు ఇతర సినిమాల్లో బిజీగా ఉన్నారు. 'బాహుబలి' తర్వాత ఒక్కసారి కూడా బ్రేక్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను కొనసాగిస్తున్నారు. రాజా సాబ్ కి వస్తోన్న రెస్పాన్స్ ను బట్టి చూస్తే, ఇది మరో హిట్ సినిమా అవ్వడం ఖాయం అనిపిస్తోంది.