Raja Saab Trailer: 'రాజా సాబ్' భారీ అప్‌డేట్.. ప్రభాస్ ఇంట్రో సాంగ్ కంప్లీట్, ట్రైలర్ రెడీ!

ప్రభాస్ 'రాజా సాబ్' సినిమా నుంచి ఇంట్రో సాంగ్ షూట్ పూర్తయింది. ఈ పాటను అక్టోబర్ 23న విడుదల చేసే ఛాన్స్ ఉంది. ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ జనవరి 9, 2026న విడుదల కానుంది.

New Update
Raja Saab Trailer

Raja Saab Trailer

Raja Saab Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్' పై  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ హారర్ కామెడీ జానర్‌లో చేస్తున్న చిత్రమిది. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల వరుసగా ఇంట్రస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌లో ప్రభాస్ స్టైల్, కామెడీ టచ్, పంచ్ డైలాగ్స్ అన్ని వింటేజ్ ప్రభాస్ ని గుర్తుకు తెస్తున్నాయి అని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ముఖ్యంగా బుజ్జిగాడు, యోగి టైమ్‌లో ఉన్న ప్రభాస్ లుక్‌ను గుర్తు చేస్తోంది. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే సినిమా మీద హైప్ మామూలుగా లేదు.

Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!

ఇంట్రో సాంగ్ కంప్లీట్.. (Raja Saab Intro Song)

తాజాగా దర్శకుడు మారుతి సోషల్ మీడియా ద్వారా మరో ఇంట్రస్టింగ్ విషయాన్ని షేర్ చేశారు. ప్రభాస్‌కు సంబంధించి చిత్రంలో ఉండే ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్ పూర్తయిందని తెలిపారు. ఈ పాటను డార్లింగ్ బర్త్‌డే అయిన అక్టోబర్ 23, 2025న మొదటి సింగిల్‌గా రిలీజ్ చేసే అవకాశం ఉందంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read: తెలుగులో మాట్లాడు..? కాంతార హీరోపై నెటిజన్స్ ఫైర్

ట్రైలర్ రిలీజ్ అప్‌డేట్.. (Raja Saab Trailer Telugu)

ఇక డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ విషయంలో కూడా మేకర్స్ నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. రాజా సాబ్ ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా ఆన్‌లైన్, థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో “భయం ద్వారాలు తెరుచుకుంటున్నాయి… దైర్యం ఉంటే ప్రవేశించండి” అనే ట్యాగ్‌లైన్ ట్రైలర్‌పై ఆసక్తిని రెట్టింపు చేసింది.

ట్రైలర్ దాదాపు 3 నిమిషాలు 30 సెకన్ల నిడివితో ఉండబోతున్నట్లు సమాచారం. గతంలో రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ వీడియో సైతం 2 నిమిషాలకుపైగా ఉండటంతో, ట్రైలర్ పై అంచనాలు పెరిగిపోయాయి.

Also Read: అక్కడ రికార్డు బ్రేక్.. దుమ్ము రేపుతోన్న 'మిరాయ్' కలెక్షన్స్

రాజా సాబ్ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. స్టార్ నటుడు సంజయ్ దత్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. సంగీతాన్ని తమన్ అందిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

ఈ చిత్రం 2026 జనవరి 9న, సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్ని ప్యాకేజీగా ఈ సినిమా రూపొందుతోంది. ట్రైలర్‌తో సినిమా మీద ఆసక్తి మరింత పెరిగే అవకాశముంది. మొత్తానికి, డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు రాజా సాబ్ ఫస్ట్ సాంగ్, ట్రైలర్ అప్డేట్స్ రూపంలో దసరా పండగ ముందే వచ్చిందని  చెప్పాలి!

Advertisment
తాజా కథనాలు