ప్రభాస్ లుక్ లీక్ చేసిన వ్యక్తి దొరికాడు!.. మేకర్స్ ట్వీట్ వైరల్ 'కన్నప్ప' మూవీ నుంచి ప్రభాస్ లుక్ లీక్ చేసిన వ్యక్తిని కనుగొంటే రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వ్యక్తి దొరికినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. By Archana 10 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update prabhash షేర్ చేయండి Prabhash: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. అయితే తాజాగా ఈ మూవీ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ లీకవడం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై హీరో మంచు విష్ణు, చిత్రయూనిట్ స్పందిస్తూ.. ఫొటో లీక్ చేసిన వారిని పట్టిస్తే భారీగా రివార్డు అందిస్తానని బంపరాఫర్ ప్రకటించారు. లీక్ చేసిన వారిని కనుగొంటే రూ.5 లక్షల నగదు బహుమతిని ఇస్తామని తెలిపారు. అలాగే లీక్ అయిన ఇమేజ్‌ను షేర్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. Also Read: వరుణ్, లావణ్య మొదటి పెళ్లిరోజుకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్!.. వీడియో వైరల్ లీక్ చేసిన వ్యక్తి దొరికాడు అయితే తాజాగా చిత్రయూనిట్ ఫొటో లీక్ చేసిన వ్యక్తి దొరికినట్లు ట్వీట్ చేసింది. తానే లీక్ చేసినట్లు ఆ వ్యక్తి స్వయంగా అంగీకరించిన వీడియోను రిలీజ్ చేసింది. "మా రాబోయే చిత్రం కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్‌ని లీక్ చేసిన వ్యక్తిని గుర్తించామని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. పూర్తి దర్యాప్తు తర్వాత అతను ముందుకు వచ్చి తన చర్యలకు అధికారికంగా క్షమాపణలు చెప్పాడు. ఈ పరిస్థితిలో మీ అందరి మద్దతుకు కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేశారు. Also Read: లేడీ సూపర్ స్టార్ సినీ కెరీర్, సక్సెస్, లవ్ స్టోరీ.. 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్' ట్రైలర్ Om Namah Shivaya!We extend our heartfelt gratitude to each one of you for your unwavering support and dedication during this recent challenge. Thanks to your constant vigilance and commitment, we are pleased to inform you that the individual & Company responsible for leaking… pic.twitter.com/DiZoWzYaF3 — Kannappa The Movie (@kannappamovie) November 9, 2024 Also Read: 'అన్‌స్టాపబుల్' షోలో చిరంజీవి పై బన్నీ కామెంట్స్..ప్రోమో చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే #prabhas #tollywood #new-look #kannappa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి