Prabhas: ఫిష్ వెంకట్‌కు అండగా బాహుబలి!

నటుడు ఫిష్ వెంకట్ కి ప్రభాస్ అండగా నిలిచారు. గత కొద్దిరోజులుగా కిడ్నీలు పాడై వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయనకు ఆర్ధిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

New Update
Prabhas financial help to actor fish venkat

Prabhas financial help to actor fish venkat

Prabhas:  టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కి(fish venkat)  హీరో ప్రభాస్ అండగా నిలిచారు. రెండు కిడ్నీలు పాడవడంతో ఫిష్ వెంకట్  గత కొద్దిరోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్  వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.  ఆపరేషన్ కి సుమారు రూ. 50 లక్షలు ఖర్చవుతుందని ఆయన కూతురు స్రవంతి  మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ టీమ్ ఆపరేషన్ కి అవసరమయ్యే ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.  ''కిడ్నీ డోనర్ ఉంటే ఆపరేషన్‌కు సిద్ధం చేసుకోవాలని.. ఆపరేషన్‌కు అవసరమయ్యే ఖర్చంతా ప్రభాస్ భరిస్తాడని'' ఆయన టీమ్ తెలిపినట్లు ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి స్వయంగా మీడియాకు వెల్లడించారు. 

Also Read:Tamannaah Bhatia: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. స్టిల్స్ పిచ్చేక్కించేసిందిగా!

నాలుగేళ్లుగా డయాలసిస్‌

అలాగే  ప్రస్తుతం తాము కిడ్నీ డోనర్ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. నాన్న బ్లడ్ గ్రూప్ తో తనది మ్యాచ్ కాలేదని, తమ్ముడు ఇద్దామనుకున్నా.. ఆరోగ్య సమస్యలు ఉండడంతో డాక్టర్లు వద్దన్నారని చెప్పింది. అందుకే వేరే డోనర్ కోసం అన్వేషిస్తున్నామని వివరించింది. అయితే ఫిష్ వెంకట్ గత నాలుగేళ్లుగా డయాలసిస్‌పైనే జీవిస్తున్నారట. కొంతకాలంగా పరిస్థితి మరింత క్షీణించడంతో బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఫిష్ వెంకట్ 'గబ్బర్ సింగ్', 'నాయక్', 'డీజే టిల్లు',  'ఆది', 'బన్నీ', 'డీ', 'రెడీ', 'కింగ్',  వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులను అలరించారు.

Also Read:Boney Kapoor Daughter: పెళ్లి పీటలేక్కబోతున్న బోనీ కపూర్ కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు