Prabhas Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస లైనప్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ఒక హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న 'ఫౌజీ'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. ప్రభాస్ 'ఫౌజీ' లో నటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.
Also Read: Maldives: మాల్దీవ్స్ టూరిజం అంబాసిడర్ గా కత్రినా.. దీని వెనుక కారణం అదేనా?
'ఫౌజీ' లోరాహుల్
ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాహుల్ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. తన లుక్ గురించి ప్రస్తావిస్తూ.. హను రాఘవపూడి - ప్రభాస్ కాంబోలో రాబోతున్న 'ఫౌజీ' నటిస్తున్నాని, అందుకే ఈ లుక్ కొనసాగితున్నాని తెలిపారు. అయితే, తన పాత్రకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. హను రాఘవపూడితో రాహుల్ రవీంద్రన్ చేస్తున్న రెండో సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబోలో "అందాల రాక్షసి" సినిమా వచ్చింది. ఈ సినిమా రాహుల్ కి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది.
#RahulRavindran confirms he’s part of the upcoming #PrabhasHanu project. Excited to join this massive film!#Prabhas #Fauji pic.twitter.com/UAgGTbzI6A
— CHITRAMBHALARE (@chitrambhalareI) June 11, 2025
Also Read: Singer Mangli: డ్రగ్స్ తో దొరికిపోయిన సింగర్ మంగ్లీ.. బర్త్ డే పార్టీలో భారీగా ఫారెన్ మద్యం!
రాహుల్ తో పాటు ఈ చిత్రంలో ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. సోషల్ మీడియా ఫేమ్ ఇమాన్వీ కథానాయికగా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 1940ల కాలం నాటి పీరియడ్ వార్ డ్రామాగా రూపొందుతోంది. సుమారు ₹700 కోట్ల బడ్జెట్ తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Also Read: HBD Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఆ రికార్డు కేవలం బాలయ్యకే సొంతం.. ఈ విషయాలు మీకు తెలుసా?