Prabhas Fauji: 'ఫౌజీ' సెట్లో అడుగుపెట్టిన డార్లింగ్.. షూటింగ్ ఎక్కడంటే?

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న 'పౌజీ' షూటింగ్ కొత్త షెడ్యూల్‌ త్వరలో హైదరాబాద్‌లో స్టార్ట్ అవ్వనుంది. 1940ల నేపథ్యంతో యాక్షన్, డ్రామా, దేశభక్తి అంశాలతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ప్రత్యేకమైన సెట్లు రూపొందిస్తున్నారు.

New Update
Prabhas fauji

Prabhas fauji

Prabhas Fauji: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డార్లింగ్  కొత్త సినిమా 'పౌజీ' పై రోజు రోజుకి అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి హను రాఘవపూడి ద‌ర్శ‌కత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌కి జోడీగా ఇమాన్వీ ఇస్మాయిల్‌ను సెలెక్ట్ చేసారు. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్‌కి సంబంధించిన కొన్ని భాగాలు పూర్తి కాగా, కొత్త షెడ్యూల్‌ కొద్దిగా ఆలస్యంగా ప్రారంభం కానుంది. అయితే,  'పౌజీ' యూనిట్ ప్రస్తుతం భారీ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

వ‌చ్చే వారం నుంచి హైద‌రాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందని సమాచారం. ఇందులో కీలకమైన యాక్షన్ స‌న్నివేశాలు, అంతేకాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా తెరకెక్కించనున్నారు. ఈ లాంగ్‌ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన నటీనటులు కూడా షూట్‌లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌కి సంబంధించిన ముఖ్యమైన స‌న్నివేశాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!

ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..!

'పౌజీ' సినిమా కథ 1940ల కాలం నేపథ్యంలో సాగుతుండగా, ఇందులో అనేక ట్విస్ట్‌లు ఉండబోతున్నాయి. హను రాఘవపూడి తనదైన శైలిలో ప్రేమ కథ, గుండెకు హత్తుకునేలా డ్రామా, భారీ యాక్షన్ సీన్స్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దేశభక్తి నేపథ్యంతో పాటు, స్వాతంత్య్రానికి ముందు గడిచే రోజులని కూడా చూపించనున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి అద్భుతమైన సెట్లు రూపొందిస్తున్నారు. ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు, ఒక అద్భుతమైన అనుభూతి సృష్టించాలని హను ఆలోచనలో ఉన్నాడు.

సెట్లు కోసం రామోజీ ఫిలిం సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ ఖర్చుతో ప్రత్యేకమైన డెకొరేష‌న్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, 'పౌజీ' కథకు సీతారామం తరహాలో ఏదైనా ప్రేరణ ఉందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం హను రాఘవపూడి ఎప్పుడు సమాధానం చెబుతాడో వేచి చూడాలి.

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న 'పౌజీ' షూటింగ్ కొత్త షెడ్యూల్‌ త్వరలో హైదరాబాద్‌లో స్టార్ట్ అవ్వనుంది. 1940ల నేపథ్యంతో యాక్షన్, డ్రామా, దేశభక్తి అంశాలతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ప్రత్యేకమైన సెట్లు రూపొందిస్తున్నారు.

Also Read: మంచు బ్రదర్స్ మధ్య వార్.. 'తల నరికి నీ భార్య చేతిలో పెడతా' అంటూ మనోజ్ ఫైర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు