/rtv/media/media_files/2025/02/26/CGCD0l9PBRBBG1Z8WXnU.jpg)
Salaar Re-Release
Salaar Re-Release: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా "సలార్" మూవీ 2023 డిసెంబర్ 22న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ₹700 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఈ మూవీ లో వచ్చే యాక్షన్ ఫైట్ సీన్లతో పూనకాలు తెపించాడు డైరెక్టర్ ప్రశాంత్. "సలార్" లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణ స్నేహితులుగా నటించగా, శృతి హాసన్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని హోంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించగా, రవి బస్రూర్ సంగీతం అందించారు.
Also Read: మజాకా రివ్యూ.. సందీప్ కిషన్ ఖాతాలో హిట్ పడిందా?
ఓటీటీ ప్లాట్‌ఫారమ్ లోనూ "సలార్" రికార్డు సృష్టించింది. ఒక సంవత్సరమంతా నెట్‌ఫ్లిక్స్ లో టాప్ 10 సినిమాల జాబితాలో నిలిచింది. ఇప్పుడు, ఈ చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సలార్. ఇప్పటికే టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది, ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమాలను రీరిలీజ్ ల రూపంలో మళ్ళీ థియేటర్లకు వెళ్లి వైబ్ అవుతున్నారు. నిర్మాతలు కూడా అభిమానుల కోరిక మేరకు హిట్ సినిమాలను మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నారు.
Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?
మార్చి 21న "సలార్" రీరిలీజ్..
అయితే ప్రభాస్ అభిమానులు ఎదురుచూసిన "సలార్" రీరిలీజ్ ఎట్టకేలకు ఫైనల్ అయ్యింది. మార్చి 21న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయటానికి రెడీ అవుతోంది మూవీ టీం. దీనితో, ప్రభాస్ అభిమానులు "సలార్" రీరిలీజ్ సెలబ్రేషన్స్‌కి రెడీ అవుతున్నారు. మరోవైపు, మహాశివరాత్రి సందర్భంగా, ప్రభాస్ నటించిన "రెబల్" సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు ఏర్పాటు చేసారు.
Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!
Also Read: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!
𝐃𝐄𝐕𝐀 Returning To His DEN “ 𝐊𝐇𝐀𝐍𝐒𝐀𝐀𝐑 ”#SalaarCeaseFire Strikes Back To Dominate The BIG Screen ! 💥#Salaar RE - RELEASING On 𝐌𝐚𝐫𝐜𝐡 𝟐𝟏𝐬𝐭 !#Prabhas #PrashanthNeel pic.twitter.com/FPIRi0SW7m
— Suresh PRO (@SureshPRO_) February 24, 2025