/rtv/media/media_files/2025/04/18/4ZPABSjHPKTqb3cdE3as.jpg)
Pooja Hegde in Retro
Pooja Hegde: నటి పూజా హెగ్డే తన భావోద్వేగాలను అభిమానులతో పంచుకుంటూ తన గతం గురించి తీయని జ్ఞాపకాలు పంచుకుంది. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘రెట్రో’ ప్రమోషన్లలో(Retro Promotions) భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ, "లేఖలు రాసుకునే రోజులు ఎంతో ప్రత్యేకం" అంటూ తన మనసులోని భావాలను తెలిపింది.
Also Read: 'ది రాజా సాబ్' ఉన్నట్టా లేనట్టా..? త్వరగా తేల్చండ్రా బాబూ..!
ఆ రోజులు మిస్ అవుతున్నా..
"ఈనాటి డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేషన్ ఫాస్ట్ గా జరుగుతోంది. కానీ, ఆ మాటల్లో భావోద్వేగం ఉండడం లేదు. వాట్సప్ వచ్చిన తర్వాత మనం ఆ 'లెటర్స్' లో ఉండే మ్యాజిక్ ని కోల్పోయాం. ఒకప్పుడు మనం మనసులోని మాటలు కాగితం మీద ఉంచి, అక్షరాల రూపంలో పంచుకునే వాళ్ళం. ఒక లేఖ రాస్తే, అవతలి వారు సమాధానం పంపేంతవరకూ ఎదురు చూసే వాళ్ళం.. ఆ అనుభూతికి ఒక ప్రత్యేకత ఉండేది. ఇప్పుడు అది మిస్ అవుతున్నందుకు నిజంగా ఫీల్ అవుతున్నా," అంటూ చెప్పుకొచ్చింది పూజా.
Also Read: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్..!
ఈ సందర్బంగా, తన జీవితంలో ఎన్నో లేఖలు రాసిన అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకుంది. అంతేకాక, భవిష్యత్తులో ఓ ప్రేమకథాతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఆమె వెల్లడించింది. ఈ సినిమా వివరాలను త్వరలోనే నిర్మాణ సంస్థ ప్రకటించనున్నారని తెలిపింది.
Also Read: మరో బడా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ.
ప్రస్తుతం పూజా తమిళ చిత్రాలైన 'జన నాయగన్', 'కూలీ', 'కాంచన 4'లలో నటిస్తూ బిజీగా ఉంది. మే 1న విడుదల కాబోతున్న 'రెట్రో' సినిమా ద్వారా ఆమె సూర్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.