Pooja Hegde: 3 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నా.. థియేటర్లో టిక్కెట్లు తెగడం లేదు: పూజ హెగ్డే

తనకు 3 కోట్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నా, సినిమాలకు అంతగా టికెట్లు అమ్ముడవడం లేదని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా ఫేమ్‌కు, సినిమా విజయానికి సంబంధం లేదని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

New Update
Pooja Hegde

Pooja Hegde

Pooja Hegde: సినిమా రంగంలో చాలా మంది హీరో, హీరోయిన్లు వారిని వారు పొగుడుకోవడం సహజమే. కానీ హద్దును మించి మాట్లాడితే, అది కొన్నిసార్లు జోక్‌గా మారిపోతుంది. తాజాగా నటి పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు ఇలాగే చర్చకు దారి తీసాయి.

తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో మంచి గుర్తింపు సంపాదించిన పూజా, ఒకానొక టైమ్ లో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగారు. అయితే వరుస ఫ్లాప్‌లతో ఆమె కెరీర్‌ ఒక్కసారిగా పడిపోయింది. తాజాగా ఈ బుట్టబొమ్మ లైన్ అప్ చూస్తుంటే మళ్ళీ తిరిగి ఫామ్ లోకి రావాలని గట్టిగా ట్రై చేస్తుందని అర్థం అవుతోంది.

Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..?

తమిళంలో 'ముగమూడి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు తొలి ప్రయత్నమే నిరాశే మిగిలింది. తర్వాత విజయ్‌తో చేసిన బీస్ట్ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా, మళ్ళీ విజయ్‌తో జననాయకన్ అనే చిత్రంలో నటిస్తోంది.

ఇప్పటికే ఆ సినిమా షూటింగ్‌లో దశలో ఉంది. ఇక సూర్యతో కలిసి నటించిన 'రెట్రో'(Retro) మూవీ మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే, లారెన్స్‌తో 'కాంచన-4'లో(Kanchana 4) నటిస్తోంది. అంతేకాదు, రజనీకాంత్ నటిస్తున్న "కూలీ" సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్‌లోనూ మెరవనుంది. ఇలా వరుస అవకాశాలతో మళ్ళీ టాప్ హీరోయిన్ గా ఎదగాలని పూజా అడుగులు వేస్తోంది.

Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..

టికెట్లు అమ్ముడవడం లేదు..

అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూజా చేసిన ఓ కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో 3 కోట్ల ఫాలోవర్స్ ఉన్నారని చెప్పిన పూజా.. “ఫాలోవర్స్ ఉన్నా, సినిమాలకు అంతగా టికెట్లు అమ్ముడవడం లేదంటూ” స్పందించారు.

తన సినిమాలకు 3 కోట్ల టికెట్లు అమ్ముడవుతాయని భావించడం భ్రమేనని చెప్పుకొచ్చింది. కొందరికి 26 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా, వారి సినిమాలు పెద్దగా ఆడవని ఉదాహరణగా పేర్కొంది. సోషల్ మీడియా కి నిజ జీవితానికి సంబంధం ఉండదంటూ తన మనసులోని భావాలను చెప్పుకొచ్చింది పూజా.

Also Read: ఫ్యాన్స్‌ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..

ఇది కొందరికి ఒక రకంగా సెల్ఫ్ గోల్ అని అంటున్నప్పటికీ, ఆమె చెప్పిన విషయం మాత్రం వాస్తవమే. సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్నా, సినిమా సక్సెస్ మాత్రం పబ్లిక్ రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంటుందన్నది వాస్తవం.

Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Advertisment
Advertisment
తాజా కథనాలు