/rtv/media/media_files/2025/10/08/pooja-hegde-2025-10-08-11-39-47.jpg)
Pooja Hegde
Pooja Hegde: తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే, కొంత గ్యాప్ తరువాత మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆమె నటించే తాజా చిత్రం, ప్రముఖ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటిస్తున్న సినిమా. ఈ ప్రాజెక్ట్ కి రవీ నెలకూడితి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతోంది.
Also Read: పవన్ సినిమాలో విలన్‌గా మల్లా రెడ్డి.. ట్విస్ట్ ఏంటంటే..?
Also Read: పాముల భయంతో బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న హీరో!
Pooja Hegde Remunaration..
ఈ సినిమాతో పూజా హెగ్డేకి టాలీవుడ్‌లో మంచి బ్రేక్ వస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇటీవల ఓ ప్రముఖ వెబ్ పత్రికలో వచ్చిన కథనాల ప్రకారం, పూజా హెగ్డేకు ఈ సినిమాలో నటించేందుకు రూ. 3 కోట్లు పారితోషికంగా ఇచ్చారని తెలుస్తోంది. ఇది ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల పూజా హెగ్డేను టాలీవుడ్ నిర్మాతలు పెద్దగా సంప్రదించట్లేదనే వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఆమె డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉండటమేనని తెలుస్తోంది. అయితే ఇప్పుడు దుల్కర్ సినిమాలో ఆమెకు భారీ పారితోషికం ఇవ్వడం చూస్తే, టాలీవుడ్‌లో పూజాకి ఇంకా క్రేజ్ ఉందని అర్థమవుతోంది.
Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!
పూజా హెగ్డే ఇటీవల రజనీకాంత్ సినిమా కూలీలో "మోనికా" పాటలో చేసిన స్పెషల్ అప్పీరెన్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి రావడంతో, మళ్లీ పూజా హవా మొదలైంది. ఈ క్రేజ్‌ని ఉపయోగించుకొని ఆమె మళ్లీ టాలీవుడ్‌లో మంచి అవకాశాలు దక్కించుకుంటోంది.
ఈ సినిమా హిట్ అయితే, పూజా హెగ్డే టాలీవుడ్‌లో మరోసారి వరుస అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉంది. ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఆమెకి ఉన్న ఫాలోయింగ్, గ్లామర్, డాన్సింగ్ టాలెంట్ దృష్ట్యా, నిర్మాతలు మళ్లీ ఆమెపై దృష్టి పెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: మోహన్‌లాల్‌కు మరో అరుదైన గౌరవం
మొత్తానికి, పూజా హెగ్డే దుల్కర్ సినిమాతో తిరిగి టాలీవుడ్‌లో అడుగుపెడుతుండగా, ఆమెకు ఇచ్చిన భారీ పారితోషికం చూస్తే, పూజ రీ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉందొ అర్థమవుతోంది.